అభిమానులను ఓటర్లుగా మార్చుకోవడంలో పవన్ ఫెయిల్ అయ్యాడా ?
అలా పవన్ ఆ ఎన్నికల అనంతరం పార్టీని పెట్టాడు. ఎవరైనా పార్టీ పెడతారు. ఇంతకు ముందు చాలా స్థానిక పార్టీలు వచ్చాయి. అయితే పార్టీకి కొన్ని నిబంధనలు నియమాలు ఉండాలి. పార్టీ వలన ప్రజలకు ప్రయోజనం ఉండాలి కదా. ప్రయోజనం సంగతి పక్కన పెడితే అసలు చాలా మందికి జనసేన పార్టీ ఉందనేది కూడా తెలియదు. పార్టీని ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లడంలో జన సేన సమిష్టిగా ఫెయిల్ అయింది. ఎక్కడ మీటింగ్ పెట్టినా తండోప తండాలుగా జనాలు వస్తున్నారు. కానీ వారంతా కూడా సినిమాల వలన పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ తో వచ్చిన ఫ్యాన్స్ అని తెలుసుకోలేక పోయారు.
పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరోగా ప్రజలు ఆక్సెప్ట్ చేశారు. కానీ ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఇంకా మంచి అభిప్రాయం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ తన కున్న కోట్లాది మంది అభిమానులను ఓటర్లుగా మార్చుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక అయినా ఒక ప్రణాళిక ప్రకారం ప్రజలను అప్రోచ్ అయితే భవిష్యత్తు ఉంటుంది.