న్యాయమే గెలిచింది భావోద్వేగంతో నాయిని..!

MOHAN BABU
 తెలంగాణ రాష్ట్రం మొత్తం  సంచలనం సృష్టించిన అనిశెట్టి మురళి హత్య కేసులో చివరికి న్యాయమే గెలిచింది. అనవసర ఆరోపణలతో నన్ను ఇరికించారని, ఇదంతా రాజకీయ దురుద్దేశంతో కొంతమంది  నాయకులు చేసిన పని అని, నా హస్తం లేకున్నా  నన్ను ఆ కేసులోకీ లాగి అందులో నన్ను ఇరికించారని, చివరికి న్యాయదేవత న్యాయం వైపు మొగ్గు చూపుతుందని, ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుందని, అన్యాయం ఎన్నటికైనా  ఓడిపోతుందని దీనికి సాక్ష్యం ఈ సంఘటనే అని  కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 జూలై 13 న జరిగిన మురళి హత్య కేసులో  నాయిని రాజేందర్ రెడ్డి కి  హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే  వరంగల్ లో సంచలనం సృష్టించిన trs కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్యకేసులో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డికి క్లీన్ చీట్ ఇచ్చింది.


నాయిని పై చేసిన  ఆరోపణలు రుజువు కానందున ఛార్జ్ షీట్ నుంచి నాయిని పేరు  హైకోర్టు తొలగించేసింది. 2017 జులై 13వ తేదీన అనిశెట్టి మురళి హత్య జరిగింది.  ఈ మర్డర్ కేసులో మొత్తం ఎనిమిది మందిపై కేసులు నమోదుచేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు FIRలో A-6గా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిని చేర్చిన పోలీసులు రాజకీయ కక్ష్యసాదింపు చర్యల్లో భాగంగానే తన పేరు చేర్చారని హైకోర్టును నాయిని రాజేందర్ రెడ్డి ఆశ్రయించాడు.


ఛార్జ్ షీట్ లో పోలీసులు ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు రుజువు చేయలేక పోవడంతో నిర్దోషిగా నిర్దారించి నాయిని పేరు తొలగించింది హై కోర్టు. తనపై రాజకీయ దురుద్దేశంతో తప్పుడు కేసులు పెట్టారని, న్యాయమే గెలిచిందని భావోద్వేగానికి గురయ్యాడు నాయిని రాజేందర్రెడ్డి. దీంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో  ఒకింత ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, అన్యాయం ఓడిపోతుందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: