వర్షంలో వాకిలి కడిగినట్టుంది.. ఏంటీ సీఎం సార్ ఇది?

praveen
సోషల్ మీడియా పుణ్యమా అని అటు రాజకీయ నాయకులు చేసే కొన్ని పనులు అప్పుడప్పుడు వైరల్ గా మారిపోతూ ఉంటాయి  అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే.  ఇక్కడ ఒక సీఎం చేసిన పని కూడా ఇలాగే వైరల్ గా మారిపోయింది. ఇక ఆయన చేసిన పని చూస్తే ప్రస్తుతం అందరూ నవ్వుతున్నారు అని చెప్పాలి. సాధారణంగా మనం సోషల్ మీడియాలో కొన్ని ఫన్నీ వీడియోలు చూస్తూ ఉంటాం  ఒక వైపు నుంచి బోరున వర్షం కురుస్తూ ఉంటుంది.

 ఇక అలాంటి సమయంలో ఇంట్లో నుంచి ఓ మహిళ గొడుగు పట్టుకొని వచ్చి మరి ఏకంగా వాకిలి పై నీళ్ళు చల్లుతూ కడుగుతూ ఉండటం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇలా ఓ వైపు పై నుంచి వర్షం పడుతున్నప్పటికీ మరోవైపు ఆ మహిళ నీళ్లు చల్లి వాకిలి కడుగుతూ ఉండడం మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. వామ్మో ఈ మహిళ తెలివి భలే ఉంది అని అందరూ పగలబడి నవ్వుకుంటారు. ఇటీవలే సీఎం చేసిన పని కూడా అందరిని  పగలబడి నవ్వుతూ ఉండేలా చేస్తుంది. ఇటీవలి కాలంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు.

 ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎంతోమంది మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసారు. ఇటీవలే భూపాల్ లో ఇలా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అటు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మొక్కలు నాటారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఆయన నీళ్లు పోయడం మాత్రం వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే ఆయన నీళ్లు పోసుకున్న  సమయంలో ఓ వైపు పైనుండి వర్షం పడుతుంది ఆ సమయంలో ఏకంగా గన్ మెన్ తో గొడుగు పట్టించుకొని మరి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మొక్కలకు నీళ్లు పోయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు సీఎం సార్ ఏంటిది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: