హుజూరాబాద్‌: టీఆర్ఎస్‌ నేతల గుండెల్లో తగ్గని 'ఈటల' గుబులు..?

Chakravarthi Kalyan
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో లేదు.. దీపావళి తర్వాత హూజూరాబాద్ ఉపఎన్నిక ఉంటుందని ఎన్నికల సంఘం తేల్చి చెప్పేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకే.. ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయినా సరే హుజూరాబాద్‌ విషయంలో టీఆర్ఎస్ నేతల గుండెళ్లో మాత్రం ఈటల రాజేందర్ గుబులు మాత్రం తగ్గుతున్నట్టు లేదు. ఎందుకంటే.. ఇటీవల టీఆర్ఎస్ నేతల మాటలు చూస్తుంటే గెలుపుపై పెద్దగా నమ్మకం కనిపించడం లేదు.

ఇటీవల కాలంలో మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి ఈటల పై చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే ఇలా అనిపించక మానదు.. హరీశ్ ఏమంటున్నాడంటే.. రాజేందర్‌ చెప్పే సెంటిమెంట్‌ డైలాగులకు ఆగం కావద్దంటున్నాడు. పనులు చేసేవాళ్లు, ప్రజల కష్టాలు తీర్చేవాళ్లే మనకు కావాలని చెబుతున్నాడు. ఈటల టీమ్ బొట్టుబిళ్లలు, కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇస్తున్నారట.. మరి మీకు రూపాయి బొట్టు బిళ్లలిచ్చేవారు కావాలా? రూ.2 వేల ఫించన్‌ ఇచ్చేవాళ్లు కావాలా? అని హరీశ్ రావు ఓటర్లను అడుగుతున్నారు.

రూ.60 గడియారం కావాలా? లక్ష రూపాయల కల్యాణలక్ష్మి ఇచ్చేవాళ్లు కావాలో తేల్చుకోమంటున్నారు. గడియారాలకు, బొట్టుబిళ్లలకే మీరు మోసపోతారా? మీ ఓటు అమ్మేసుకుంటారా అని హరీశ్ అడుగుతున్నారు. దీనిపై హుజూరాబాద్ ప్రజలు ఆలోచన చేయాలంటున్నాడు హరీశ్ రావు. ఈటల హుజూరాబాద్‌లోఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాడో హరీశ్ రావు వంటి నేతలను బట్టే తెలుస్తోంది.

అయితే దీన్నిబట్టి ఈటల రాజేందర్‌కు పరిస్థితి అనుకూలంగా ఉందని చెప్పలేం.. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉన్నందువల్ల ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి హూజూరాబాద్‌లో ఉంది. చివరి నిమిషంలో పరిస్థితి ఎవరికి అనుకూలంగా మారుతుందో చెప్పలేం.. ఇన్ని తంటాలు పడి టీఆర్ఎస్‌ గెలిచినా.. ఆ గెలుపు పెద్ద విజయంగా టీఆర్ఎస్ చెప్పుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదన్నది మాత్రం వాస్తవం. మరి తెలంగాణ అంతటా ఆసక్తి రేపుతున్న ఈ హూజూరాబాద్ పోరు చివరకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: