నో టీచర్స్ డే : అసలు డీఎస్సీ ఊసే మరిచిపోయారు సర్ ?
గొప్ప గొప్ప కలలు
లేని సందర్భం
గొప్ప గొప్ప కలలు
వద్దనుకున్న సందర్భం
అంతా కన్నీళ్లే ..
అయినా ఉపాధ్యాయ దినోత్సవం
అంటే పాలకులకో ప్రత్యేక గౌరవం
కొత్త ప్రభుత్వాలు వచ్చాక కొత్తగా రాయాల్సినవేవో వెతకాలి. అంటే కొత్తగా ప్రభుత్వం చేయాల్సినవేవో చెప్పాలి. కానీ ప్రభుత్వాలు మారినా మారనవి కొందరి తలరాతలే. నిరుద్యోగుల తలరాతలే! ఈ క్రమంలో ప్రభుత్వాలు నోటిఫికేషన్లు వేయవు అని చెప్పడంలో అర్థం లేదు. అసలు ఆ దృష్టే లేకపోతే ఏం చేస్తాం. డీఎస్సీ వ్యవహారం కూడా అలానే ఉంది. ఏళ్లకు ఏళ్లు ప్రిపేరవుతున్న వారి గతేం టి? ఇదీ ఇవాళ్టి ప్రశ్న.
ఉద్యోగులు ఎవ్వరయినా ఆశ పెట్టుకునేది కొత్త జీతం మీద. ఆ పని ఈ ప్రభుత్వం చేయలేదు. నిరుద్యోగులు ఎవ్వరయినా ఆశ పెట్టు కునేది నోటిఫికేషన్ మీద. అది కూడా ఈ ప్రభుత్వం ఇంత వేగంగా తేల్చేలా లేదు. ఇంకేం సమస్య ఎలా పరిష్కారం అవుతుం దని అనుకుంటున్నారా? ఏం లేదు మళ్లీ ఓ ప్రకటన ఇస్తే సరిపోతుంది సమస్యలు అన్నవి వాటంతట అవే పరిష్కృతం అయిపోతాయి. వాస్తవానికి ఉద్యోగాల కల్పన అన్నది ఇవాళ చాలా అరుదుగా అయిపోతుంది. గురువుల కొరత వెన్నాడినా ప్రభుత్వం పట్టించుకు న్న దాఖలాలే లేవు. అలా అని పోస్టుల భర్తీ పై తమకున్న అభ్యంతరాలేంటో చెప్పక కాలాన్ని వృథా చేయడం మినహా చేస్తున్న దేంటి లేదు.
నిరుద్యోగులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం డీఎస్సీ ఊసే మరిచిపోయింది. గత ఏడాది దీనిపై హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పటి దాకా సంబంధిత ప్రకటనే చేయలేదు. కరోనా కారణంగా అన్ని పనులూ ఆపేసిన ప్రభుత్వం ఉపాధ్యాయుల భర్తీ విషయమై కూడా ఏమీ తేల్చుకోలేకపోతోంది. దీంతో నిరుద్యోగుల ఆశలు అలానే ఉన్నాయి. వాటిని నెరవేర్చుకునేందుకు మార్గమే కనపడడం లేదు.గత ఏడాది దీనిపై ప్రకటనల పేరిట హడావుడి చేసిన ఆదిమూలం (మంత్రి) ఈ సారి ఆ ఊసే లేదు. డీఎస్సీ పేరిట ఓ నోటిఫికేషన్ ఇవ్వడం కానీ లేదా ఇతర పోస్టుల భర్తీలో కానీ జగన్ ప్రభుత్వం చొరవ చూపడం లేదన్నదే ప్రధానమయిన అభియోగం.