బాధిత గొంతుక : శ్రీకాకుళంకు పవన్ కల్యాణ్ ?

RATNA KISHORE
తన కార్యకర్తకు గాయాలు కావడం
ఓ దాడిలో అధికార పార్టీ వర్గీయులు
అతి చేయడం అన్నవి పవన్ కోపానికి కారణాలు
మరో ప్రత్యక్ష కార్యాచరణకు పవన్ సిద్ధం అవుతున్నారు. తనదైన శైలిలో ప్రజా సమస్యలపై స్పందించి పాలకుల్లో కదలిక తీసుకు వచ్చే పవన్ ఈ సారి రహదారుల సమస్యలను దారికి తేనున్నారు. అదేవిధంగా తీవ్రతలను తగ్గించి, ఉద్రికత్తతలను తగ్గించి తన దైన పంధాలో తన మనుషులను పరామర్శించి వెళ్లనున్నారు. గత బంధం స్పీకర్ తో ఉన్నందున ఆయన రాక అన్నది ఇప్పుడు ఆసక్తిదాయకం. (గతంలో స్పీకర్ సీతారాం పీఆర్పీలో కీలకంగా పనిచేశారు)

జనసేనాని పవన్ కల్యాణ్ శ్రీకాకుళం విచ్చేయనున్నారని ప్రాథమిక సమాచారం. స్పీకర్ తమ్మినేని నియోజకవర్గంలో జరిగిన దా డిలో భాగంగా గాయపడిన జనసైనికుడు, ఆమదాలవలస నియోజకవర్గ ఇంఛార్జ్  పేడాడ‌ రామ్మోహన్ ను పరామర్శించనున్నారు. ఇ ప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానంగా ఉన్న రహదారుల గురించి జన సైనికులు పలు వీడియో సందేశాలు సామాజిక మాధ్యమా ల్లో పోస్టు చేసి ఉద్యమ స్థాయిలో ఈ సమస్యపై తమ గొంతు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఆమదాలవలస ని యోజకవర్గంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన పైడి రామ్మోహన్ స్పీకర్ మనుషులు కొందరు దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే దాడు లకు పాల్పడిన వైనంపై పవన్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది.

దాడులకు సంబంధించి ప్రత్యక్ష కార్యాచరణకు పూనిక వహించా లని జనసేనాని భావిస్తున్నారు. గతంలోనూ జన సైనికులపై దా డులు జరిగిన సందర్భాల్లో పవన్ ఇదే స్థాయిలో ఇంతే తీవ్రతతో రియాక్ట్ అయ్యారు. ఈ సారి కూడా తన గొంతుకను వినిపించా లని జన సైనికులు సైతం డిమాండ్ చేస్తున్నారు. బాధ్యు లపై చర్యలు తీసుకునేలా పోలీసు వర్గాలపై ఒత్తిడి చేయాలని కోరుతున్నారు.

పాలక పక్షాలను ప్రశ్నించడమే తప్పు అన్న వి ధంగా, నిరసనల్లో భాగంగా ఫ్లెక్సీల ఏర్పాటే అపరాధం అన్న విధంగా తమను బెదిరిస్తూ, అదిరిస్తూ, మీ అంతు చూస్తాం అని చె ప్పడం, పోలీసులు ఉంటుండగానే అరవడం ఎంత మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఇది సంబంధిత స్ఫూర్తికే విఘాతం అని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పవన్ శ్రీకాకుళంకు వస్తే స్పీకర్ వర్గీయులు ఏ విధంగా రియాక్ట్ అవుతా రు అన్నది ఆసక్తిదాయకంగా మారింది. గతంలో ఉద్దానం సమస్యపై తెలుగు దేశం  ప్రభుత్వాన్ని ప్రశ్నించి, స్పందించేదాకా పోరాడి న ఘటనలు ఉన్నాయి. చాలా రోజులకు రహదారుల సమస్యపై పోరాటానికి జనసేన ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపునివ్వడం అది కాస్త ఉద్రిక్తతలకు దారివ్వడం అన్నవి పవన్ ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: