మెట్రో ఉరుకు పరుగు : హైద్రాబాదీలకు ఆ...కిరోసిన్ బండే నచ్చిందా?

RATNA KISHORE
ఒకప్పుడు పొగ బండి..ఇప్పుడు మెట్రో బండి..కాలం చేసిన వింత. కాలం చేసిన వింతల్లో మరో వింత అత్యంత వేగంగా గమ్యాన్ని చే రుకునేలా ఆధునిక సాంకేతికత సాయంతో మెట్రో రైళ్లకు పరుగులు నేర్పడం. పరుగులు నేర్చుకున్న మెట్రో రైళ్లు హైద్రాబాద్ వాసు ల కష్టాలను చాలా మేరకు తగ్గించాయి. ఉద్యోగులకు సేవలందించేందుకు ముందున్నాయి. భద్రతతో కూడిన ప్రయాణానికి అవి ప్రా ధాన్యం ఇచ్చాయి. ఇన్ని చేసినా కూడా మెట్రో సక్సెస్ కాలేదు. ఇంత చేసినా కూడా మెట్రో పరుగులు కాసుల వానను మోసుకు రాలేదు. ఫలితంగా అవి ఇప్పుడు చాలా నష్టాల్లో ఉన్నాయి. ఇంత చేసినా తమకు మిగిలించి సున్నా అని ఆవేదన చెందుతున్నారు ఎల్ అండ్ టీ ప్రతినిధులు. ఈ నేపథ్యంలో ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి.


సిటీ బస్సులు, ఎక్స్ ప్రెస్ సర్వీసులు, మెట్రో సర్వీసులు పేరిట ఆర్టీసీ అందించే సేవలకు అదనంగా మరికొన్ని సెట్విన్ బస్సులు న గరంలో తిరుగాడేవి. ఇవన్నీ కిరోసిన్ తో నడిచే బండి మాదిరిగా విపరీతం అయిన పొగ వెదజల్లుతూ ఆర్టీసీ ఛార్జీకే ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చి వచ్చేవి. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులు, సెట్విన్ బస్సులు కొన్ని చోట్ల  పోటాపోటీగా నడిచేవి. కొన్ని సార్లు సె ట్విన్ బస్సులు రద్దీతో ఉంటే, ఆర్టీసీ బస్సులు ఖాళీగా నడిచేవి. అంతేకాకుండా కండక్టర్ల దురుసు ప్రవర్తన కారణంగా ఆడవాళ్లెం దరో ఇబ్బంది పడేవారు. అయినా కూడా ప్రత్యామ్నాయం లేక కొన్ని సర్వీసులు ఆర్టీసీ సకాలంలో నడపక ప్రజలు ఈ కిరోసిన్ బండినే నమ్ముకునేవారు. తరువాత కాలంలో మెట్రో వచ్చాక ప్రయాణం సులభతరం అయింది. సుఖవంతం అయింది. అంత హాయి అయిన ప్రయాణం హైద్రాబాద్ ప్రయాణికులకు ఓ కల. క్యాబ్ కన్నా చాలా తక్కువ. ఆర్టీసీ కన్నా కాస్త ఎక్కువ..కానీ సేఫ్ అండ్ హై డిఫైన్డ్ వెర్షన్ లో ప్రయాణం. ఇవేవీ మన హైద్రాబాదీలకు నచ్చలేదు. ధర ఒక్కటే అతి పెద్ద కారణం అయిపోయి మెట్రోపై అనవసర రాద్ధాంతం ఒకటి నడిచింది. కరోనా తరువాత కూడా కొన్ని సర్వీసులు నడిపేందుకు తెలంగాణ సీఎం అనుమతి ఇచ్చినా, అందుకు అనుగుణంగా మెట్రో క్యాబిన్ లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయించినా అవేవీ ప్రయాణికుల సంఖ్యను పెంచలేదు. ఆర్థికంగా సంస్థ నిలదొక్కు కునేందుకు ఉపయోగపడలేదు. ఫలితంగా సంస్థ తన వాటాలో ఉన్న ఆస్తులను అమ్ముకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడమే దురదృష్టకరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

hyd

సంబంధిత వార్తలు: