కేసీఆర్ అంటే లీడర్ : ఎందుకు సామీ దండాలు!
ఎప్పటి నుంచో కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై ఓ విధం అయిన ఆసక్తి అందరిలోనూ ఉంది. అందుకు అనుగుణంగా కేసీఆర్ కూడా తెలం గాణ ప్రయోజనాలపై మాట్లాడతారని ఆశించారు. కానీ ఆయన కేవలం పార్టీ వ్యవహారాలకు సంబంధించి మాట్లాడిన విధంగానే మా ట్లాడారు తప్ప పెద్దగా ఆ ప్రాంతానికి ఉపయోగపడేవి ఏవీ లేవు. టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థల ఏర్పాటుకు సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఇష్యూ..ఇవాళ ఆయన ప్రధానితో మాట్లాడాల్సిన విషయం అది కాదు. కానీ ఎందుకనో దాన్ని తెరపైకి తెచ్చి, అసలు విషయాలు అన్నీ తొక్కేశారు.
పది అంశాలతో ఓ వినతి ఇచ్చారు ప్రధాని మోడీని కలిసిన సందర్భాన కేసీఆర్. ఈ వినతిలో ఎక్కడా ఏవిధం అయిన విభజన చ ట్టంలో అంశాల ప్రస్తావన లేదు. ఆయనెప్పటి నుంచో అడగాలనుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా అన్న సంగతే లేదు. పోనీ ఆయన స్వప్నం, సంకల్పం అయిన దళిత బంధుకు కూడా నిధులు అడగలేదు. సొంత పనిమీద వెళ్లొచ్చిన విధంగా ఆయన ప్రధానిని కలిసి వచ్చారు. ఆయన అడిగిన ఏ అంశాలు అటు ఆంధ్రాను కానీ ఇటు తెలంగాణను కానీ ప్రభావితం చేసేవే కాకపోవడం గమనార్హం. తెలంగాణ భవన్ ( తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఢిల్లీ కేంద్రంగా నడిచే కార్యాలయం, ఇది పార్టీ కార్యా లయం మాదిరి కాదనుకోండి) నిర్మాణానికి స్థల కేటాయింపు మినహా ఆయనెక్కడ ఉమ్మడి ఆస్తుల విభజనపై కానీ మరో విషయ మై కానీ మాట్లాడలేదు. ఎందుకనో ఈ సారి కేసీఆర్ ఫాస్ట్ గా లేరు. ఏ నిర్ణయమూ ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకోవడం లేదు. వెలువరించనూ లేదు.