కేసీఆర్ అంటే లీడర్ : బండి ఓ సున్నా ! కావొచ్చు!
ఆవేశాలే రాజకీయాలను నడిపిస్తాయి. ఆవేశాలే రాజకీయాలను ఓడిస్తాయి. ఆవేశాలే అనర్థాలకు తావిస్తాయి. కేసీఆర్ ఇలాకాలో రేపటి వేళ జరిగేది ఇదే. ఇప్పుడు జరుగుతున్నదీ ఇదే. బీజేపీ - కేసీఆర్ బంధం కారణంగా కొత్త సమీకరణలకు తెరలేస్తున్నది. కొత్త పరిణామాలకు తావ్విస్తున్నది. బీజేపీ నుంచీ ఎప్పటి నుంచో సహకారం కోరుకుంటున్న కేసీఆర్ దానిని అమలు చేసే ప్రక్రియ ఒకటి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయంగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తు న్నారన్న మాట నిజం. బీజేపీతో దోస్తీ కడుతూనే కొత్త రకం పాలిటిక్స్ కు ఆయన సంధానకర్తగా ఉండాలని యోచిస్తున్నారు.
బీజేపీ తో కేంద్రంలో ఉన్న సఖ్యత కారణంగా ఆయన పెద్దగా మోడీని టార్గెట్ చేయరు. టార్గెట్ చేసినా ఏవో కొన్ని విషయాలపై మా త్రమే! ఇవి తెలిసినా తెలియకున్నా బండి సంజయ్ మాత్రం తెలంగాణ వాకిట కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర పదజాలంతో కేసీ ఆర్ పై విమర్శలు చేస్తారు. ఈ విమర్శల కారణంగా బండి మైలేజ్ పెంచుకునేందుకు ప్రయత్నించినా ఇప్పటికిప్పుడు అది జరిగే ప ని కా దు. కేవలం తిట్ల పురాణంతో సాధించేది ఏమీ ఉండదు. ఎందుకంటే బండి సంజయ్ కూడా ఓ పార్లమెంట్ సభ్యుడే. కరీంనగర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని మరువకూడదు. కానీ ఆయన ఆ విషయం మరిచి మరో అధికార పార్టీని దూషించడంలో వాస్తవాలకు అతీతంగా దూషించడం అన్నది చేయకూడని పని. బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి ఏ పాటి కృషి చేస్తున్నా రో అన్నది టీఆర్ఎస్ శ్రేణులే కాదు చాలా మందికి ఆసక్తి ఉన్న విషయం. మోడీ సాయంతో ఆయన చేయాల్సిన పనులు చాలా ఉ న్నాయి కూడా! కానీ అవన్నీ మరిచిపోయి బండి ఏకపక్షంగా మాట్లాడడంతో తరుచూ చర్చలకు తావిస్తున్నారు.