చిన్నారులకు కరోనా సోకితే.. సర్వేల్లో తేలింది ఇది !

NAGARJUNA NAKKA
కరోనా సోకిన చిన్నారుల్లో మరణాలు తక్కువేనని జీవన్ రక్షా సంస్థ చేసిన సర్వేల్లో వెల్లడైంది. ఆగస్ట్ 16నుంచి 22వరకు కర్ణాటకలో 166మంది కరోనాతో చనిపోతే అందులో ఇద్దరు మాత్రమే పిల్లలు ఉన్నారని తెలిపింది. వారిలో ఒకరు 14ఏళ్ల అమ్మాయిని.. ఆమెకు డయాబెటిస్ ఉందని.. మరొకరు 15ఏళ్ల బాలుడు అని చెప్పింది. దేశంలో 10ఏళ్ల లోపు పిల్లలెవరూ కరోనాతో మరణించలేదని వివరించింది.
ఇక చిన్నారులకు అక్టోబర్ లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జైడస్ క్యాడిలా టీకా పిల్లలను కరోనా నుంచి కాపాడేందుకు సిద్ధమవుతోంది. ఈ వ్యాక్సిన్ 12నుండి 17ఏళ్ల చిన్నారులకు ఉపయోగించనున్నారు. మరోవైపు మన దేశంలో ఈ వ్యాక్సిన్ ప్రభుత్వం నుండి ఆమోదం పొందింది.  
ఇక కరోనా టీకాల పంపిణీలో భారత్ కొత్త రికార్డు సృష్టించింది. దేశంలో మంగళవారం ఒక్కరోజే కోటికి పైగా కరోనా టీకా డోసులు ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. రికార్డు స్థాయిలో 1,08,84899మందికి వ్యాక్సిన్ ఇచ్చామని పేర్కొంది. ఇప్పటి వరకు ఒక్క రోజులో అత్యధిక డోసులు ఇచ్చింది ఆగస్ట్ 31వ తేదీనేనని ప్రకటించింది. గత ఐదు రోజుల్లో రెండు సార్లు కోటికి పైగా టీకాల పంపిణీ జరిగిందని వివరించింది.
మరోవైపు ఏపీలో ఇప్పటి వరకు మూడు కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 3,00,87,377డోసులు ఇచ్చామనీ.. అందులో 2,16,64,834మందికి తొలి డోసు, 84,22,543మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిందని పేర్కొంది. కేంద్రం నుంచి కావాల్సినన్ని వ్యాక్సిన్లు వస్తే రెండు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని తెలిపింది.

ఇక భారత్ లో 24గంటల్లో 16లక్షల 6వేల 785కరోనా టెస్టులు చేయగా.. 41వేల 965మందికి పాజిటివ్ వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 460మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 28లక్షల 10వేల 845కు చేరగా.. 4లక్షల 39వేల 20మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24గంటల్లో 33వేల 964మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 




 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: