తెలంగాణ విద్యార్థులకు ఆ గడువు పెంపు..!

NAGARJUNA NAKKA
దోస్త్ రెండో విడత సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. నిన్నటితో గడువు ముగియగా దాన్ని సెప్టెంబర్ 6వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 42వేల మంది విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారనీ.. మిగతా విద్యార్థులు గడువులోగా చేసుకోవాలని సూచించారు. దోస్త్ మూడో విడత వెబ్ ఆప్షన్లు సెప్టెంబర్ 15నుంచి ప్రారంభం అవుతాయని.. 24న సీట్లు కేటాయిస్తామన్నారు.
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వ రెసిడెయన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లు, హాస్టళ్ల ఆధారంగా నడిచే పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇవ్వలేదు. వీటిలో దాదాపు నాలుగు లక్షలమంది విద్యార్థులు చదువుతున్నట్టు అంచనా. వీరందరూ స్కూళ్లకు వెళ్లడానికి వీల్లేదు. వీరికి ఆన్ లైన్.. టీవీ పాఠాలు కొనసాగుతాయని విద్యాశాఖ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలు 16నెలల తర్వాత నేడు ఓపెన్ అయ్యాయి. టీచర్లు, పిల్లలు, వారిని స్కూల్ కు, ఇంటికి తీసుకెళ్లే వారు ఎంతవరకు కరోనా నిబంధనలు పాటిస్తారనే ప్రశ్నార్థకంగా మారింది. పిల్లల్ని బడికి పంపే పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు మాస్కులు ధరించేలా.. శానిటైజర్ వాడేలా చూసుకోవాలి. వీలైనంత వరకు పిల్లల్ని పేరెంట్స్ బడి దగ్గరకు పంపాలి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకు స్నానం చేయించాలి.
మరోవైపు ఆన్ లైన్ తరగతుల వల్ల లాభం లేదనే.. కేజీ టు పీజీ ప్రత్యక్ష తరగతులు ప్రారంభించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పిల్లలు ఆన్ లైన్ క్లాసులకు బదులు వీడియో గేమ్స్ కు బానిసలవుతున్నారని చెప్పారు. బడికొచ్చిన పిల్లలందరినీ కన్నబిడ్డల్లా చూసుకుంటామనీ.. ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల కోసం ఒత్తిడి చేయవద్దని.. ఫీజులు పెంచవద్దని ఆదేశించారు. డిగ్రీ విద్యార్థులకు సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగించడంతో వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మరోవైపు కరోనా నిబంధనల మధ్య పాఠశాలలు ఎలా కొనసాగుతాయో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: