పసుపు అంటే ఫైర్ : విన్నింగ్ - పెయిర్

RATNA KISHORE
శ్రీ‌కాకుళం రాజ‌కీయాల్లో
ఇద్ద‌రు బీటెక్ గ్రాడ్యుయెట్లు
కీల‌కం అవుతున్నారు
ఒక‌రు ఎంపీ రాము
మ‌రొక‌రు కూన ర‌వి

సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర కు తార్కాణంగా నిలిచే ఆమదాలవలస నియోజకవర్గంలో టీడీపీ మళ్లీ పాగా వేయాలని అంటే ఇప్పుడు కూన రవికుమార్ కు ఎంపీ రాము సాయం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీ రాముతో మ‌రింత సన్నిహితంగా ఉం టున్నారు. క‌లిసి ప్ర‌జా ఉద్య‌మాలు చేస్తున్నారు. శ్రీ‌కాకుళం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్ గా అధినేత బాబు సంబంధిత బా ధ్య‌త‌లు కూన ర‌వికి అప్ప‌గించిన నాటి నుంచి పొలిటిక‌ల్ గా ఆయ‌న మ‌రింత యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా ఆమ‌దాల‌వ‌ల‌స స్టే ష‌న్ అభివృద్ధిపై ఎంపీ రాము దృష్టిసారించారు. ఈ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం కూడా ఎంపీ రామూ ప‌రిధిలో ఉండ‌డంతో సంబంధిత ప నులు  క‌నుక స‌కాలంలో పూర్త‌యితే ఆ క్రెడిట్ ను ఎన్నిక‌ల వేళ ఆ ఇద్ద‌రూ పూర్తిగా వినియోగించుకోవ‌చ్చు. ఇటీవ‌లే ఆమదాల వలస రైల్వే స్టేషన్ పరిధిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవల ఎంపీ రాము శంకుస్థాపన చేశారు. ఈ పనులు అనుకున్న స మయానికి పూర్తయితే కాస్తయినా టీడీపీ మైలేజ్ ఆమదాలవలసలో పెరిగేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా టీడీపీ ఎంపీ సా యంతో రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టి సంబంధిత అభివృద్ధిని ఉదాహరణగా చూపించి, రానున్న ఎన్నికల్లో ఓటర్ల ముందు కు పోవాలన్నది కూన రవికుమార్ ఆలోచన అని తెలుస్తోంది.

ఎంపీ రాము కూడా తన పరిధిలో ఉన్న ఆమదాలవలస నియోజకవర్గ అభివృద్ధికి తగు ప్రాధాన్యం ఇవ్వాలని ఎప్పటి నుంచో భా విస్తున్నారు. ఆమదాలవలసతో పాటు ఇదే అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న పొందూరు మండలం చేనేత ఉత్పత్తులకు తన దైన చొర‌వ తీసుకుని వీటికో మార్కెట్ క‌ల్పించాలని, శ్ర‌మ‌కు త‌గిన రీతిలో గౌర‌వం ద‌క్కేలా ఉత్ప‌త్తుల విలువ పెంచాల‌ని ఆశిస్తు న్నారు. ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ నుంచి శ్రీకాకుళం ఢిల్లీకి చేరుకుని పొందూరు పర్యటనలో పాల్గొని చేనేత ది నోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వ‌హ‌ణ చేశారు. ఈ పర్యటనలో కూడా ఎంపీ రాము హైలెట్ అయ్యారు. చేనేత ఉత్పత్తులకు రేపటి వేళ బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు ఎంపీ రాము కేంద్రం సాయం పొందాలని యోచిస్తున్నారు.

పొందూరు ఖాదీ సంబంధిత పరిశ్రమ అభివృద్ధి చెందితే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఈ ప్రాంతం ఎంతో అనుకూలం. ఎంపీ కింజ‌రాపు రాము - రవికుమార్ జోడి ఇప్పటికే పలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని నియోజకవర్గ ప్రజల మన్ననలు అందుకున్నారు. తాజా వివాదం మినహాయిస్తే కూన ర వి గతంలో కంటే ఇప్పుడు మాటల తీవ్రతను తగ్గించి, ప్రజల్లోకి వెళ్లేందుకు చేస్తున్న కార్యా చరణ సఫలీకృతం అయితే అల్లుడు ర వికుమార్ మామ తమ్మినేనిని మించిపోవ‌డం త‌థ్యం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: