అందమైన చీర.. కట్టుకోవటమే కాదు.. ఆకలి తీర్చుకోవచ్చు?

praveen
నేటి మోడ్రన్ యుగంలో ఎన్నోరకాల వినూత్నమైన డ్రెస్సులు మార్కెట్ లోకి వస్తూ ఉన్నాయి.  ప్రతి ఒక్కరూ మోడ్రన్ డ్రెస్ లు ధరించడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.  అయితే స్టైల్ గా కనిపించడానికి ఎంతోమంది మోడరన్ డ్రెస్ లు దరిస్తున్నప్పటికీ.. అందంగా కనిపించాలి అంటే మాత్రం ప్రతి ఒక్కరు ధరించేది చీర. చీర ఆడపిల్ల అందాన్ని మరింత పెరుగుతూ ఉంటుంది. ఒకసారి చీరలో కనిపించారు అంటే ఏ అబ్బాయి అయినా సరే ఫ్లాట్ అవ్వాల్సిందే. అంతలా ఒక అమ్మాయి అందాన్ని చీర ఎంతో ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తూ ఉంటుంది. అందుకే నేటి రోజుల్లో మోడ్రన్ మగువలు స్టైల్ గా కనిపించడానికి ఎన్నో రకాల దుస్తులు ధరించినప్పటికీ అందంగా కనిపించడానికి మాత్రం అందరికీ ఫస్ట్ చాయిస్ చీర .



 ప్రస్తుతం మహిళలను ఆకర్షించటానికి ఎన్నో రకాల చీరలు మార్కెట్లో ఉన్నాయి. కాంచీపురం, ధర్మవరం, ఉప్పాడ, పోచంపల్లి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల బ్రాండ్లు.. ఎంతో అందమైన చీరలు. ప్రస్తుతం మగువల అందాన్ని పెంచేందుకు ఇలాంటి చీరలు ఎన్నో ఉన్నాయి. ఇక నేటి రోజుల్లో ఎంతో వినూత్నమైన చీరలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా ఇలాంటి చీర గురించే. ఆ చీర కట్టుకున్నారు అంటే ఏకంగా గాల్లో తేలి పోతున్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఆ చీర బరువు అంత తక్కువ. ఇక ఆ చీర కట్టు కున్నారు అంటే మీ అంత అందంగా ఇంకెవరూ కనిపించరెమో.. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది ఆ చీర.



 అయితే ఈ చీర మీ అందాన్ని పెంచడమే కాదు మీ ఆకలి కూడా తీరుస్తుంది. అదేంటి చీర ఆకలి తీర్చడం ఏంటి అని అవాక్కవుతున్నారు కదా. కానీ నేను చెప్పేది వింటే నిజంగానే నోరెళ్ళబెడతారు.  ఆలోచనకు అభిరుచి తోడైతే ఎలాంటి వినూత్న ప్రయోగం అయినా సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఇలా సక్సెస్ అయింది మనం మాట్లాడుకుంటున్న చీర. కేరళలో కొల్లం కు చెందిన అన్న ఎలిజబెత్ జార్జ్ అనే ఓ యువతి ఎడిబుల్ చీరను తయారుచేసింది. కేరళలో ఎంతో ఇష్టంగా జరుపుకొనే ఓనం పండుగ సందర్భంగా బంగాళదుంప బియ్యం పిండి కలిపి 100 ఏ ఫోర్ సైజ్ పేపర్ సహాయంతో ఈ చీరను తయారుచేసింది 18 అడుగుల పొడవున్న ఈ చీర తయారుచేయడానికి 30 వేల రూపాయల వరకు ఖర్చు చేసిందట. ఇక ఈ చీరను మహిళలు కట్టుకోవడమే కాదు ఆకలేస్తే తినవచ్చు కూడా అంటూ ఈ చీర గురించి చెప్పుకొచ్చింది ఆ యువతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: