సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ?

Suma Kallamadi
ఇటీవల కాలంలో రోడ్ యాక్సిడెంట్స్ బాగా జరుగుతున్నాయి. అతి వేగమో లేక డ్రైవింగ్‌లో నిరక్ష్యమో తెలియదు. కానీ, రహదారులన్నీ రక్తసిక్తమవుతున్నాయి. బుధవారం మరో ఘోర ప్రమాదం జరిగింది. ఎక్కడంటే.. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలఘాట్ చౌరస్తాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ నెంబర్ నేషనల్ హైవే‌పై గోలావ నుంచి హైదరాబా‌ద్‌కు వస్తున్న ఓ కారు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కారులో ఉన్న మిగతా ముగ్గురికి తీవ్రమైన గాయలు కాగా, వారిని జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అక్కడున్న స్థానికులు చెప్తున్నారు.


 ఇకపోతే జహీరాబాద్ ఆస్పత్రిలో ఉన్న ఆ ముగ్గురి హెల్త్ కండిషన్ విషమంగా ఉండటంతో వారిని అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ రోడ్డు ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఈ క్రమంలోనే యువతి మృతదేహాన్ని తీసేందుకు క్రేన్ వచ్చింది. దాని సాయంతో సదరు మహిళ డెడ్ బాడీ బయటకు తీశారు. బాధితులందరూ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి‌కి చెందిన నలుగురు ఫ్రెండ్స్ గోవాకు ట్రిప్ వెళ్లినట్లుగా సమాచారం.


 ఈ క్రమంలోనే వారు రిటర్న్ అవుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇకపోతే మృతి చెందిన యువతి పేరు నిహారిక అని, ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని తెలుస్తోంది. ఆమెతో పాటు ఉన్న మిగతా ప్రయాణికులు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అనే అక్కడున్న స్థానికులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పలు వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రేన్ సాయంతో నుజ్జునుజ్జయిన కారు ముందు భాగంలోని యువతి మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టంకు పంపించారు.  బాధితులు వివరాలు తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు విషయం తెలిపేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: