మనిషి బతికుండగానే చంపేసినట్టు, ఒకరికి బదులు మరొకరికి, ఫోర్జరీ సంతకాలు చేసినట్టు, అర్హులను పక్కనపెట్టి అనర్హులను అందలం ఎక్కించి నట్లు అనేక సంఘటనలు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ చనిపోయిన వ్యక్తి యొక్క పేరుతో ఒక ప్రభుత్వ దవాఖానలో ఫోర్జరీ సంతకాలు చేసి దాదాపు 23 లక్షల రూపాయలను కాజేసిన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే హన్మకొండలోని ప్రభుత్వ ఛాతీ మరియు టిబి హాస్పిటల్ లో నిత్యం వచ్చే పేషెంట్లకు భోజన సదుపాయం కల్పించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకం ఛాతి మరియు టీబీ రోగులు చికిత్స పొందుతున్న సమయంలో వారికి ప్రత్యేక భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఇందులోనే ఒక కాంట్రాక్టర్ తన వక్రబుద్ధి ప్రదర్శించి అడ్డంగా దొరికడని చెప్పవచ్చు. ఈ ఆసుపత్రిలో భోజనం అందించే కాంట్రాక్టర్ 29 -8- 2012 లో చనిపోయిన టువంటి ఆయన మరణ ధ్రువీకరణ పత్రం తెలియజేస్తున్నది. కానీ అధిక ధన ఆశకు పోయి , ఎవరు ఏం చేస్తారు లే, ఎవరికీ తెలియదు కదా అనుకొని 29 -8- 2012 చనిపోయినటువంటి మరో కాంట్రాక్టర్ పేరుతో 2012 నుంచి 30-03-2014వరకు, అంటే రెండు సంవత్సరాల నాలుగు నెలల వరకు బిల్లులను దాదాపు ఇరవై మూడు లక్షలు డ్రా చేశాడు. ఈ బిల్లులు అన్ని చాతి మరియు టీబీ హాస్పిటల్ బిల్లులో రికార్డు అయి ఉన్నాయి.
**అసలు కాంట్రాక్టర్ ఎవరు.. ఏం జరిగింది..?**
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెందిన సింగపూర్ గ్రామ వాసి అయిన భగవాన్ రెడ్డి అను కాంట్రాక్టర్ ప్రభుత్వ ఛాతీ మరియు టీవీ హాస్పటల్లో చికిత్స పొందుతున్నటువంటి రోగులకు మరియు వైద్య సిబ్బందికి భోజనాన్ని ఏర్పాటు చేసే కాంట్రాక్టు టెండర్ ను ఆయన దక్కించుకున్నారు. ఈ యొక్క టెండరును ఆ కాంట్రాక్టర్ ఏ సంవత్సరంలో దక్కించుకున్నాడో తెలియదని హాస్పటల్ సిబ్బంది, అధికారులు చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం అదే కాంట్రాక్టర్, జి భగవాన్ రెడ్డి కాంట్రాక్టర్ మాత్రం 05-08-2010 మంచి 14-03-2014 వరకు మాత్రం భగవాన్ రెడ్డి పేరుతోనే డబ్బులు డ్రా చేసినట్టుగా ఆస్పత్రి అధికారులు ఇచ్చిన బిల్లులు మాత్రం లభ్యమయ్యాయి. అందులో కొన్ని మాత్రమే ఆన్ లైన్ పేమెంట్ ద్వారా డ్రా చేసినట్లు చూపిస్తుండగా, మరికొన్ని డబ్బులను చెక్కుల ద్వారా డ్రా చేసినట్టు తెలుస్తోంది. అయితే భగవాన్ రెడ్డి డ్రా చేసిన డబ్బులు ఏ ఒక్క బిల్లు కూడా ఫార్మ్ పేరుతో బిల్లులు డ్రా చేసినట్టు ఉండక పోవడం గమనార్హం.