తాలిబన్ల కి షాక్.. మళ్లీ మూడు నగరాలని లాక్కున్నారు?

praveen
ఇటీవలే ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్లు మరోసారి ఆధిపత్యాన్ని సాధించారు  అమెరికా సైన్యం ఉపసంహరించుకున్న తర్వాత అరాచకాలు సృష్టించారు. కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ స్వాధీనం చేసుకోవడంతో ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు ఘని  చివరికి దేశం వదిలి పారిపోయాడు. దేశాన్ని తాలిబన్ల చేతిలో పెట్టాడు. దీంతో తాలిబన్లకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.  కొన్ని దశాబ్దాల కిందట తాలిబన్లు ఇలా ఆదిపత్యాన్ని సాధించిన సమయంలో అక్కడి ప్రజలను బానిసలుగా చేసి వారిలో భయాన్ని పుట్టించి కనీసం ఎదురు మాట్లాడటానికి కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. ఇక తాలిబన్లు చూస్తే ప్రజలు కూడా వణికిపోయారు.



 కానీ ఇప్పుడు మళ్ళీ  ఆయుధాలతో ఆధిపత్యంలోకి వచ్చిన తాలిబన్లకు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల నుంచి వరుస షాకులు తగులుతున్నాయి అని తెలుస్తుంది. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలలో ఎంతోమంది మహిళలు తాలిబన్ల రాజ్యం మాకు వద్దు అంటూ నిరసన తెలుపుతున్నారు.  అయితే ఇలా ఉద్యమాలు చేస్తే ఏకంగా తాలిబన్లు దారుణంగా కాల్చి చంపుతారు అని తెలిసినప్పటికీ వీరవనితల లాగా పోరాడుతున్నారు. మరికొన్ని ప్రాంతాలలో ఏకంగా జనాలు సైతం తిరగబెడుతూ తాలిబన్లకు షాక్ ఇస్తున్నారు.  ఇంకోవైపు ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు పారిపోయిన  ఉపాధ్యక్షుడిగా ఉన్నా అమృల్లా సాలెహ్  తనని తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.



 ఇక సాలెహ్ ఆధ్వర్యంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ వరుసగా తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను మళ్ళీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇప్పటికే చారిక ర్ అనే నగరాన్ని తాలిబన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో మూడు నగరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. బసు, పోలె హేశార్, డెహ్ సలామ్ ఈ మూడు ప్రాంతాలను మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. దీంతో తాలిబన్ల కు ఊహించని షాక్ తగిలింది. రానున్న రోజుల్లో ఆప్ఘనిస్తాన్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: