షర్మిల@ 200 నామినేషన్లు.. మురిసిపోతున్న కేసీఆర్?
ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్ ప్రయోగించిన అస్త్రాల్లో షర్మిల కూడా ఒకరు అన్నది ప్రస్తుతం అందరూ అనుకుంటున్న మాట. అసలు హుజురాబాద్ ఉప ఎన్నికల వైపు చూడను అని ప్రకటించిన షర్మిల మళ్లీ అంతలోనే హుజరాబాద్ లో దీక్ష చేపట్టడం సంచలనంగా మారింది. అంతేకాదు ఇక నిరుద్యోగులు అందరూ హుజూరాబాద్ నియోజకవర్గం లో పోటీ చేసేందుకు నామినేషన్లు వేయాలి అంటూ షర్మిల పిలుపునివ్వడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇలా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో షర్మిల అమలు చేస్తున్న వ్యూహాలతో కేసీఆర్ ఎంతో సంతోషంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఎందుకు అంటారా.. ఇటీవలే నిరుద్యోగులను నామినేషన్లు వేయాలని పిలుపునిచ్చింది షర్మిల. ఏకంగా నిరుద్యోగులతో 200 వరకు నామినేషన్లు వేయించే అవకాశం కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే టిఆర్ఎస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో కాకుండా కాంగ్రెస్ బిజెపి బలంగా ఉన్న ప్రాంతాల్లో ఇలా రెండు వందల నామినేషన్లు వేయించాలని అనుకుంటుందట షర్మిల. ఇలా చేయడం వల్ల అటు బిజెపి కాంగ్రెసు ఓట్లు చీలిపోయి ఇక టిఆర్ఎస్ కు ఎంతో మేలు జరిగే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది ఇలా షర్మిల 200 నామినేషన్లు వేయించబోతుంది టాక్ వినిపిస్తూ ఉండడంతో అటు కె.సి.ఆర్ మురిసిపోతున్నట్లు తెలుస్తోంది.