ఓవర్ టు అసెంబ్లీ : సీఎం స్టడీ అవర్స్
పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి
మంత్రులకు సీఎం సూచన!
త్వరలో ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. సెప్టెంబర్ మూడో వారంలో సమావేశాలకు పూనుకుంది. ఇందుకు సంబంధించిన స్ప ష్టత మరికొద్ది రోజుల్లో వెల్లడి కానుంది. అసెంబ్లీ సందర్భంగా చర్చకు రానున్న అంశాలపై ఇప్పటికే ఏపీ సర్కారు కూలంకుషంగా అ ధ్యయనం చేస్తోంది. ఎన్ని రోజులు సభ నిర్వహించాలి. ఎన్ని గంటలు విపక్ష సభ్యులకు కేటాయించాలి? తదితర విషయాలను ఏపీ అసెంబ్లీ కార్యాలయ వర్గాలు పరిగణనలోకి తీసుకుంటూ, సంబంధిత నివేదిక ఒకటి రూపొందిస్తున్నారు. ఈ సారి అసెంబ్లీలో పాత మంత్రులే కొనసాగే ఛాన్స్ ఉన్నందున సంబంధిత శాఖలు చూస్తున్న వారందరికీ ఇప్పటికే సమాచారం వెళ్లింది. సభలకు పూర్తి స మాచారంతో రావాలని సీఎంఓ తో సహా ఏపీ స్పీకర్ కార్యాలయం కూడా కోరింది అని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రాన్ని వేధిస్తున్న ఆర్థిక సమస్యలు, రుణాలు వాటి వివరాలు చర్చకు రానున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, కోవిడ్ కారణంగా నిలిచిపోయిన పనులు, వాటికి ఇవ్వాల్సిన ప్రాధాన్యాలు, జిల్లాల వారిగా నెలకొన్న సమస్యలు, వాటికి కేటాయించాల్సిన నిధులు తదితర అంశా లపై సుదీర్ఘ చర్చ జరిగేందుకు అవకాశాలే ఎక్కువ. ఇదే సందర్భంలో బడ్జెట్ కేటాయింపులు, వ్యవసాయ, విద్య తదితర శాఖలకు చేసిన కేటాయింపులు వీటిపై కూడా ప్రధాన చర్చ ఉండేందుకు ఆస్కారం ఎక్కువ. ఈ వర్షాకాల సమావేశాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా సీఎం ప్రణాళిక రూపొందింపజేస్తున్నారు.
మాట్లాడించి ప్రజల దగ్గర తమ పాలనపై సానుకూల వైఖరి పొందేందుకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలని సీఎం యోచిస్తున్నారు అని కూడా తెలుస్తోంది.