రేవంతు రాక : తిట్లతో ఇమేజ్ పెరిగిపోతుందా?
తెల్లారితే సోనియాను పొగిడి
కేసీఆర్ ను తిడితే రాజకీయం
రేవంత్ కు మాత్రమే తెలిసిన రాజకీయం
టీడీపీలో ఇలానే తిట్టారా?
ఇలానే తిట్టి టీడీపీ పేరు తెచ్చుకుందా?
బాబు మార్కు రాజకీయాల్లో ఇన్ని తిట్లు ఉన్నాయా?
పాపం గురువును మించిపోవాలన్న ఆశ అలా ఉందా?
పార్టీని నడిపే శ్రద్ధ ఆయనలో ఉంది. పార్టీని గెలిపించే సత్తా ఆయనలో ఉందా? పదవులు సరే వాటికి ఆయన కొత్త అందం తెస్తారా? కేసీఆర్ ను తిడితే సోనియా ఏమయినా సీఎం పదవి ఇస్తామని చెప్పారా? అదే పనిగా నోటికి వచ్చిన విధంగా తిట్టి జనంలో చులకన అవుతున్నామన్న సోయి కూడా లేకుండా ఎందుకలా తిడతారు ? కాంగ్రెస్ మార్కు రాజకీయాలంటే బూతులు తిట్టి ఇమేజ్ తెచ్చు కోవడం అని అనుకుంటున్నారా లేదా క్రియాశీల రాజకీయం నడిపి పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నారా? ఓయూ లీడర్ల దగ్గర నుం చి అరువు తెచ్చుకున్న స్పీచులు చదివి రేవంత్ లీడర్ అయిపోవాలని భావిస్తున్నారా?
రెండు సభలు జరిగాయి. రెండు సభల్లోనూ దండోరా వినిపించాలన్న తపన ఉంది. దళిత, ఆదివాసీల సమస్యలే దండోరాగా చేసు కుని తమ గొంతు వినిపించాలన్న తపన ఉంది. బాగుంది. ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి లీడర్లను తమవైపు తిప్పుకోవాలన్న తపన కూ డా ఉంది. ఇంకా బాగుంది. దళిత ఆఫీసర్లను కేసీఆర్ బాగా చూసుకోవడం లేదు అన్న బాధతో ఏవేవో తిట్టారు అనుకుందాం ఆ స్థా యి తిట్లు ప్రవీణ్ కూడా తిట్ట లేదే! అంటే బాధిత వర్గాల కన్నా మీరే ఎక్కువ బాధను మోస్తూ పాపం వారికి ఊరట ఇస్తున్నారా?
తెలంగాణలో బడులు ఎవరు రద్దు చేశారు. ఎందుకు రద్దవుతాయి. కాంగ్రెస్ తీసుకువచ్చిన బడులను కేసీఆర్ ఎందుకు ఎత్తేస్తారు.పోనీ అదే నిజం అనుకుందాం.. అలా ఎత్తేస్తే మీరు ఆ రోజు ఏం చేశారు. ఎన్నికలు సమీపిస్తే మాట్లాడడం బాగుంది కానీ అసలు సమస్య సమీపిస్తే మీరు ఎక్కడుంటారు? ఎక్కడున్నారు? అన్నదే ఇప్పుడు తేలాల్సినవి. కాంగ్రెస్ పాలనలో తప్పిదాలే లేవు.. అన్న విధంగా మాట్లాడకండి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన పాలనలో ఎందరికి అన్యాయం జరిగిందో ఓ సారి ఆలోచించండి.స్కాములే లేని పాలన మీది అని చెప్పకండి. ఎంత కాదన్నా ఔనన్నా ..నాటి స్కాముల గోల ఇప్పటికీ గుర్తుకువస్తూనే ఉంటుంది.వైఎస్సార్ హయాంలో జరిగిన అవినీతి మరిచిపోలేం. ఇంకా ఆ కేసులు నడుస్తున్నాయి కదా! మరేంటి మీరేదో అస్సలు అవినీతి మరకలు అంటవు మాకు అని అంటున్నారు. తిడితే మీరు మీడియాలో హైలెట్ అవుతారా? అదే పని రోజూ చేయండి కానీ కాస్తయినా ప్రజల సమస్యలపై క్షేత్ర స్థాయి పోరు జరపండి.