బీజేపీ బీజియమ్ : జై జగన్ - జై కిషన్
- ప్రేమ..ఒప్పందం ?
రాజకీయం అర్థం కాదు
అర్థం చేసుకోవాలన్నా
అది అంతుచిక్కదు
జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేతలు ఏ వ్యాఖ్యలు చేసినా అవన్నీ పేపర్ స్టేట్మెంట్ల కోసం అని తప్పక ఓ నిర్థారణ కు రావాలి. సొంత మనుషులు, సొంత సామాజికవర్గం మనుషులు అయిన జగన్ అండ్ కో ను ఆయన ఏమీ అనరు కానీ పైకి మా త్రం మనం ఆశ్చర్యపోయేలా..మనమే ఒకింత కళ్లింతలు చేసుకునేలా మాట్లాడిపోతారు. అందుకు బీజేపీ హై కమాండ్ ఇచ్చిన ఆ దేశాలు కొన్ని కారణం అవుతాయి. అంతకుమించి సోము వీర్రాజు కానీ విష్ణు వర్థన్ రెడ్డి కానీ ఏమీ అనరు. ఒకవేళ ఏమయినా వ్యాఖ్యలు చేసినా కూడా అవేవీ తీవ్ర స్థాయిలో ఉండవు. ఉండ కూడదు కూడా!
అతిథి దేవుడే కాదనం కానీ!
ఉదయం ఆయనే లక్ష్యం.. తరువాత సతీసమేతం గా జగన్ ను కలిసి ఆయన ఆతిథ్యం పొందడం కిషన్ జీ కే సాధ్యం అయిన రాజకీయం. కానీ జగన్ మాత్రం బైబిల్ పార్టీ అని సంజ య్ చేసిన వ్యాఖ్యలు ఎంత వేగంగా ఎలా మరిచిపోయారో అన్నది ఇంకా హాశ్చర్యం! తిరుపతి ఉప ఎన్నికల కారణంగా ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత వేగంగా చొచ్చుకుపోయాయో అన్నది ఇప్పటికీ మరువలేం. ఇవేవీ పట్టించుకోకుండా ఈ రోజు రాష్ట్రానికి వచ్చిన కిషన్ ను ఆతిథ్యం ఇచ్చి పంపారు.
విమర్శలా! పట్టించుకోం మేం!
ఇవాళ కిషన్ రెడ్డి పర్యటన మొత్తం రాష్ట్రానికి తామేం చేశామో చెప్పుకునేందుకే లక్ష్యంగా సాగింది. రాష్ట్రాన్ని నడుపుతున్నది కేంద్ర పథకాలే అని చెప్పడం వెనుక రహస్యం ఏంటన్నది తరువాత పూర్తిగా తామే అంతా నడిపిస్తున్నాం అని చెప్పడమే అత్యంత విడ్డూ రం. రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ లేదన్నది ఆయన వాదన బాగుంది. పోనీ అభివృద్ధికి కేంద్రం ఏం చేస్తుంది అన్నది చెబితే బాగుండు. అది కూడా తిరుపతి కేంద్రంగా ఆయన చెప్పిన మాటలు విని నవ్వుకోవడం మినహా చేయగలిగిందేమీ లేదు. సొంత సామాజికవర్గం నేతలు రాష్ట్రంలో అధికారంలో ఉండగా ఆయన విమర్శలు చేయడం కేవలం నోటి తుంపర్లు మాత్రమే!