పొలిటిక‌ల్ సైన్స్ విత్ కేసీఆర్ : క‌ట‌క‌టాల రేవంత్ ?

RATNA KISHORE
త్వ‌ర‌లో రేవంత్  ఏమైత‌డు
ఏమీ కాడు కాకుండా పోడు
అయితే గియితే ఎమ్మెల్యే అయిత‌డు
అంత‌కుమించి ఏమీ కాడు
అయ్యేలోగానే కేసీఆర్ అరెస్టు చేయిస్త‌డు
ఇదీ టీఆర్ఎస్ గుస గుస...
తెలంగాణ రాజ‌కీయాల‌కు కొత్తేం కాదు.తిట్ల పురాణంలో కేసీఆర్ ను మించి ఎవ్వ‌రూ లేరు అనుకునేరు. కొత్త‌గా వ‌చ్చిన నాయ‌కు డు అయిన పీసీసీ చీఫ్ రేవంత్ చాలు. ఆయ‌న సంస్థానంలో ఉంటూ ఆయ‌ననే తిట్ట‌డంలో ఘ‌ న‌త ద‌క్కించుకున్నాడు. ద‌ళితుల ప క్షపాతిగా పేరు ఎవ‌రికి వ‌స్తే వారిదే తెలంగాణ అన్న విధంగా మాట్లాడుతున్న వీరంతా నిన్న‌టి వ‌ర‌కూ ఏమ‌య్యారు ? వీరి ప్రేమేం టి ? వీరి అవ‌స‌రం ఏంటి?  అన్న‌వి తేల‌క త‌ల‌లు ప‌ట్టు కోవాలి మ‌నం. ఏం కాదు నాలుగు తిట్లు తిడితే హీరోలు అనుకునే రేవంత్ రె డ్లు తెలంగాణ‌లో చాలా మంది ఉన్నారు కానీ.. కొత్త కొమ్ముల కార‌ణంగా ఆయ‌న దూక‌వ‌చ్చు. ఉరిమి,ఉరిమి చూడవ‌చ్చు..ఉరికి, ఉరికి మాట్లాడ‌వ‌ చ్చు. కానీ అదెంత కాలం?
అమ‌రుడి జ్ఞాప‌కం
ఎందుకు?
మీరేం చేశారు వారికి?

 
అమ‌రులు,ద‌ళితులు,ఆదివాసీలు వీరే వీళ్ల‌కు ఆయుధాలు. బాగుంది. ఆ రోజు ఉద్య‌మంలో కేసీఆర్ తో రేవంత్ ఉన్నాడ‌ని గుర్తు. ఫొటోలు కొన్ని మిస్ అయి ఉండ‌వ‌చ్చులే! ఎవ్వ‌ర‌యినా తెచ్చిస్త‌రా! త‌ప్ప‌క దాచుకుంటాను. ఇప్పుడు మాట్లాడిన లేదా మాట్లా డ‌ల‌నుకుంటున్న కేసీఆర్ స్నేహితులు అంతా కాంగిరేసులో ఉన్నా స‌రే! రేవంత్ కు పాపానికి కూడా మ‌ద్ద‌తివ్వ‌రు.. మ‌రెందుకు ఆయ‌న గ‌ర్జిస్తున్న‌డు. అదే పాలుపోవ‌డం లేదు. 10 సీట్లు వ‌స్త‌యా పోనీ కాంగిరేసుకు అదీ చూద్దాం.. అందాక కాస్త తిట్లు త‌గ్గిస్తే బెట‌ర్ .. ఆ రోజు ఉద్య‌మంలో అమ‌రుల బాట‌లో ఎవరు న‌డిచారు. పోనీ కేసీఆర్ రాజ‌కీయ పార్టీనే న‌డిపించిండు అనుకుందాం, అ లా చూసుకున్నా ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌లో టీడీపీ లేదు. చంద్ర‌బాబు లేడు. చంద్ర‌బాబు కోవ‌ర్టు లు కూడా లేరు. ఇప్పుడెందుకు అమ‌రుల జ్ఞ‌ప్తి. అంటే ఓటు కోస‌మేనా సారూ! వాకే ! మీకే మా ఓటు.. కారు గుర్తుకే సారీ హ‌స్తం గుర్తే మా ఓటు. గుర్తే కాదు గుర్తుకే ! దిద్ది చ‌ద‌వండి.. చూసి ప‌ల‌కండి.. వ‌త్తి ప‌ల‌కండి.. నొక్కి వ‌క్కాణించండి సారూ !
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: