పెట్రో స్పీక్స్ : నేరం నాది కాదు ! నిర్మలమయిన మనసు
ట్రీట్మెంట్ ఎవ్వరికి?
రోగం ఎక్కడిది
ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి?
తేలని మరియూ తెలియని
ప్రశ్నకు అత్త గారి మాట ఏమన్నా ఉందా?
ఆర్థిక సంబంధ రోగాలివి. మందులు వాడాలి
లేదా ఉపశమనం అయినా చెప్పాలి..
ఏదీ లేకుండా ఎలా అత్తా!
(ఈ ఒక్క మాట పవన్ స్టయిల్ లో సదువుకోండ్రి)
నిస్సహాయ స్థితిలో కేంద్రం ఉందని, ఆర్థిక ప్రగతి లేనేలేదని నిన్నటి వరకూ విన్న మాట. అయితే ఆర్థిక ప్రగతి కోలుకుంటే, కాస్త మెరుగు పడితే ఏం చేస్తాం అన్నది మాత్రం చె ప్పకపోవడం ఇప్పటి వింత. ఇటీవల కాలంలో ఎకనామికల్ స్ట్రక్చర్ బాగుందని ఆమె చెప్పడం, కాస్త కోలుకుందని పేర్కొనడం వింటూ వింటూ పోతే నవ్వు కాక ఇంకేమీ రా దు. కోలుకుంటే ఏదో ఒక ఉపశమన చర్యకు పూనుకోవాలి. కానీ అదేమీ ఉండదు. కోలుకుంటే తక్షణ సర్దుబాటు లేదా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. అవి చేయరు గాక చేయ రు కానీ తాము నడిపించేది ఓ మహత్తర ప్రభుత్వాన్ని అని మాత్రం బీరాలు పలుకుతారు. రాగాలు తీస్తారు. గారాలు పోతారు. ఇదేనయ్యా! తెలుగింటి కోడలు తెలుగు రాష్ట్రా లకు చేసే సాయం.
ప్రజలంతా కొనుగోలు సామర్థ్యం పెంచుకోవాలి
వింటున్నారా ఇదేదో పులకేసీ మాట అయితే కాదు
మన పాలకుల మాటే..వేదమంటి మాట..
ధరలు పెరిగితే చూస్తూ ఊరుకుంటామా? ఊరుకోం! తగ్గించేందుకు ఏదయినా ప్రయత్నం చేస్తామా? తప్పక చేస్తాం! ఇలాంటివి విని విని విసిగిపోయిన భారతీయులకు నిర్మ లా సీతారామన్ చెప్పే ప్రతీ మాటా ఇదెక్కడో విన్న విధంగానే ఉందే అనుకుంటారు. కానీ జరిగేది జరిగిపోతుంది. గత ప్రభుత్వాల హయాంలో ఆయిల్ బాండ్లను కాంగ్రెస్ జారీ చేయడం వల్లనే తాము పెట్రో ధరలు తగ్గించలేక పోతున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం, అది విని అంతా ఓహో! అదీ నిజమే కావొచ్చు అని భ్ర మ పడడం జరిగిపోయి ఉంటాయి.
భారం ఎంతయినా
భరించండి..
ఇప్పటికిప్పుడు
చేసేదేం లేదు...
యూపీఏ సర్కారు హయాంలో పెట్రో కంపెనీలకు సబ్సిడీ కింద చెల్లించాల్సిన మొత్తాలను నగదు రూపంలో కాకుండా బాండ్లను జారీ చేయడం వల్లనే తాము ఇప్పుడీ అవస్థ లు పడుతున్నామని నిర్మలా సీతారామన్ చెబుతున్నారు. గత ప్రభుత్వాల అప్పు లను తాము తీరుస్తున్నామని అందుకే ఈ కష్టాలు అని పదే పదే విన్నవించుకుంటున్నా రు. కానీ పెట్రో ధరలు తగ్గడం మాటేమో కానీ తాము కోలుకోలేని ఆర్థిక పతనాన్ని మాత్రం భారతీయులు చవి చూస్తున్నారు. ఇప్పటికే ధరల ప్రభావం కారణంగా కొన్ని సం స్థలు దివాళాకు చేరువలో ఉన్నాయి. చిన్న,చిన్న కుటీర పరిశ్రమలు ఉత్పత్తికీ, వ్యాపార లావాదేవీలకూ మధ్య పొంతన లేక ఊసురోమంటున్నాయి. అయినా సీతారామన్ ఓ మాట అయితే స్పష్టం చేశారు రానున్న పండుగ సీజన్ లలో కొనుగోలు సామర్థ్యం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని ఆశాభావం ఒకటి వ్యక్తం చేశారు. మరి! కొనుగోలు సామర్థ్యం ఎలా పెరుగుతుంది లేదా ఎలా పెంచుకోవాలి అన్నవి మాత్రం ఆమె విన్నవించనే లేదు.