మహిళలకు గుడ్ న్యూస్.. డ్వాక్రా గ్రూపులకు 20 లక్షల రుణాలు?
ఇక ఈ కొత్త రూల్స్ ప్రకారం స్వయం సహాయక బృందాలకు ఏకంగా భారీ మొత్తంలో రుణ సదుపాయం లభించినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకోవాలి అంటే ఏదో తనఖా అవసరం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం స్వయం సహాయక బృందాలు ఎలాంటి తనఖా లేకుండానే 20 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఇటీవలే bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది నిన్నటి వరకు ఈ లిమిట్ కేవలం పది లక్షలు గా మాత్రమే ఉండేది. దిల్ దయాల్ అంత్యోదయ యోజన మిషన్లో భాగంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో రోజుల నుంచి దీన్ దయాల్ అంత్యోదయ యోజన అనే పథకాన్ని అందిస్తోంది. ఇక పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే క్రమక్రమంగా స్వయం సహాయక బృందాలకు రుణాలు ఇస్తూ వస్తోంది. అయితే ఇటీవలే ఆర్బిఐ కొత్త రూల్స్ తీసుకొచ్చిన దాని ప్రకారం డ్వాక్రా గ్రూపులు రుణాలు మంజూరు చేసేటప్పుడు ఎలాంటి డిపాజిట్లను పెట్టుకోకూడదు. అంతేకాదు సేవింగ్స్ ఖాతాలో ఎలాంటి ఆంక్షలు విధించకుండాఉండాలి. అంతేకాకుండా ఇక లోన్ మంజూరు సమయంలో మార్టిన్ కూడా తీసుకోకూడదు.