షాకింగ్ న్యూస్‌: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కొండా సురేఖ ?

VUYYURU SUBHASH
తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారు ? అన్న దానిపై క్లారిటీ లేదు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు కీలక నేతలు పోటీలో ఉన్నారు. సీఎం కేసీఆర్ సైతం అభ్యర్ధి విషయంలో వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఎంతో మంది కీలక నేతల పేర్లు వినిపించినా తాజాగా నియోజక వర్గానికి చెందిన విద్యార్థి నేత, బిసి కులానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పేరు దాదాపుగా ఖరారైందని అంటున్నారు. ఇక ఇటీవల హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి పాడి కౌశిక్ రెడ్డి గులాబీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖరారైంది. టిఆర్ఎస్ అభ్యర్థి విషయంలో దాదాపు ఒక క్లారిటీ వచ్చేసింది.
ఇక పార్టీ మారిన‌ ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేసే విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఈటెల పోటీ చేయని పక్షంలో ఆయన భార్య ఈట‌ల జ‌మునా రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తారని మరో టాక్ వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ లో ఉంటారు అన్న దానిపై క్లారిటీ లేదు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురి పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో అదిరిపోయే ట్విస్ట్ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ టిక్కెట్ ఇస్తే తాను ఇక్కడ నుంచి పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ముందు నుంచి  వైఎస్ అభిమానులు ఉన్న కొండా దంపతులు ముందు నుంచి కాంగ్రెస్‌లో కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఆమె టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. 2018 ముందు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కొండా సురేఖ కు టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె తిరిగి కాంగ్రెస్ లోకి జంప్ చేసి పరకాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆమె భర్త కొండా మురళి ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించిన వీరు టిఆర్ఎస్ లో మాత్రం స్త‌బ్ధుగా ఉండిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన వెంటనే కొత్త ఉత్సాహం తొణికిస‌లాడుతోంది. ఈ క్రమంలోనే హుజురాబాద్ లో తాము సత్తా చాటుతామని టిక్కెట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డికి సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: