వ్యాక్సిన్, మాస్క్ వేసుకోని వాళ్లకే అనుమతి..!
ఇక కరోనా వైరస్ జన్యు క్రమాన్ని మార్చుకుంటూ పంజా విసురుతోంది. బ్రిటన్ లో తొలిసారి గుర్తించిన ఈటా వేరియంట్ భారత్ కు పాకింది. కర్ణాటక మంగళూరులోని ఓ వ్యక్తిలో ఈ కొత్త రకాన్ని గుర్తించినట్టు వైద్యులు తెలిపారు. కొద్ది రోజుల తర్వాత అతను కోలుకున్నట్టు చెప్పారు. వైరస్ జన్యు క్రమంపై పరిశోధన చేసేందుకు నమూనాలను పరిశోధన కేంద్రానికి పంపగా.. అతనిలో కొత్త రకం బయటపడినట్టు వైద్యులు చెప్పారు.
మరోవైపు చిన్నారుల్లో కోవిడ్ కట్టడి కోసం తయారు చేసిన కొవావాక్స్ టీకా 2022జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశముందని సీరం సీఈవో అధర్ పూనావాలా అన్నారు. అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థ కొవావాక్స్ టీకాను అభివృద్ధి చేసింది. 18ఏళ్లు పైబడిన వారి కోసం ఈ సంస్థ రూపొందించిన టీకా ఈ ఏడాది అక్టోబర్ లోనే వస్తుందన్నారు. అయితే డీసీజీఐ అనుమతులపై వాటి విడుదల ఆధారపడి ఉంటుందని తెలిపారు.
ఇక కుంభమేళాలో జరిగిన కరోనా టెస్టుల స్కాంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్ ల్లోని పలు ల్యాబ్ లపై దాడులు నిర్వహించింది. కరోనా పరీక్షలు చేయాలని ఈ ల్యాబ్ లకు ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఇచ్చాయి. అయితే ఒకే మొబైల్ నెంబర్, ఒకే అడ్రస్ తో ఎంతో మందికి కోవిడ్ టెస్ట్ చేసినట్టు తెలుపుతూ ఈ ల్యాబ్స్ నివేదికలు తయారు చేసినట్టు తేల్చింది. టెస్టులు చేయకుండానే తప్పుడు పత్రాలు సృష్టించినట్టు తెలిపింది.