వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు.. ఆమెతో కలిసి అలా చేయటం అంటే ఇష్టమట..!
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ? అని వెంకీ మామను అడగగా.. వెంకటేష్ దానికి సమాధానం చెబుతూ.. నా బెస్ట్ ఫ్రెండ్ నా భార్య నీరజ .. తన వల్ల నాకు వేరే బెస్ట్ ఫ్రెండ్స్ అవసరం రాలేదు .. ఏం మాత్రం సమయం దొరికిన తన భార్యతో కలిసి టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను .. అలాగే ఇద్దరం కలిసి వెకేషన్ కి వెళ్తాం .. ఆమెతో కలిసి అప్పుడప్పుడు వంట చేయడం నాకు ఎంతో ఇష్టం అని కూడా అన్నారు .. అలాగే రానా చిన్నతనంలో ఎంతో సైలెంట్ గా ఉండేవాడని అన్నారు .. నా మంచం కింద దూరి సూపర్ హీరోల పాత్రల బొమ్మలతో ఆడుకుంటూ ఉండేవాడు అంటూ వెంకటేష్ చెప్పుకొచ్చాడు.
అలాగే తనకు క్రికెటర్స్ లో మహేందర్ సింగ్ ధోని అంటే చాలా ఇష్టం అంటూ వెంకటేష్ చెప్పుకొచ్చాడు.. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సచిన్ , ధోనీ ని కలవడం గురించి కూడా చెప్పుకొచ్చాడు .. అలాగే వారి డ్రెస్సింగ్ రూమ్ లో ధోనిని అభినందించేందుకు వెళ్లిన సమయంలో అక్కడ ధోనిని చూసి షాక్ అయ్యానని కూడా చెప్పుకొచ్చారు.. అక్కడ ధోని చేసిన పని గురించి కూడా వెంకటేష్ చెప్పాడూ ఏం చెప్పాడో తెలియాలంటే మరికొన్ని గంటల్లో ఆహలో ప్రసారమై అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఈ పూర్తి ఎపిసోడ్‌లో వెంకటేష్ , బాలయ్య ఎలాంటి సందడి చేశారు చూడాలి.