ఇటు సినిమాలు అటు వెకేషన్లు.. ఈ హీరోయిన్ల ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Amruth kumar
ఎవరైనా ఆరు రోజులు పని చేస్తే ఓ రోజు సెలవు కోరుకుంటారు .. ఎంతైనా వారం అంతా పనిచేసే అలసిపోతం కాబట్టి.. హీరోయిన్లు కూడా అంతే.. ఒక్కోసారి  బ్రేక్ లేకుండా సినిమాల్లో నటిస్తూ ఉంటారు.. అందుకే కొందరు బ్యూటీస్ ఇప్పుడు వెకేషన్ లు ఎంజాయ్ చేస్తున్నారు .. సినిమాలు చేస్తూనే పర్సనల్ స్పేస్ తీసుకుంటున్నారు .. ఆ ముద్దుగుమ్మలు ఎవరు అనేది ఇక్కడ చూద్దాం. లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం ఎంతో బిజీ హీరోయిన్గా కొనసాగుతున్నారో కొత్తగా చెప్పక్కర్లేదు ..

తెలుగులో తండెల్, హిందీలో రామాయణం సినిమాలతో ఫుల్ బిజీగా కొనసాగుతున్నారు .. అందుకే కాస్త సమయం దొరికినప్పుడల్లా రిలాక్స్ కోసం తన చెల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు సాయి పల్లవి .. ఇక్కడ బీచ్లో సేద తీరుతూ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.. మరో సీనియర్ భామ‌త్రిష కూడా మామూలుగా వరుస సినిమాలతో దూసుకుపోతుంది .. ముందుగా తెలుగులో చిరంజీవితో విశ్వంభ‌ర తో పాటు .. కోలీవుడ్లో అజిత్ , విజయ్ , సూర్య వంటి అగ్ర హీరోలతో వరుస సినిమాలో నటిస్తున్నారు .. ఇలా ఇంత బిజీగా ఉన్నా కూడా ఈ సీనియర్ బ్యూటీ కాస్త సమయం దొరికితే చాలు పటాయ బీచ్ కు వెళ్ళిపోతున్నారు ..

 థాయిలాండ్ లో త్రిష ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 2024 లో కాస్త జోరు తగ్గించిన శ్రీ లీల.. 2025లో మాత్రం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు .. వచ్చే కొత్త  సంవత్సరంలో ఐదు సినిమాలతో ఈ బ్యూటీ రెడీగా ఉంది .. ఈ లోపే తన వెకేషన్ లకు ప్లాన్ చేస్తున్నారు. మరో హీరోయిన్ కీర్తి సురేష్ సైతం బేబీ జాన్ రిలీజ్ తర్వాత వెకేషన్ కు వెళ్ళిపోయారు .. ఇలా టాలీవుడ్ అగ్ర హీరోయిన్లు అందరూ ఒకపక్క సినిమాలు చేస్తూనే .. మరోపక్క పర్సనల్ స్పేస్ తీసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: