మంత్రి కొండపల్లిపై అసత్య ప్రచారం వెనక..?
వైకాపా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో కీలక నేత. ఉత్తరాంధ్ర మొత్తాన్ని ప్రభావితం చేయగల నాయకుడు. కానీ అదంతా గతం. అధికారం ఉంటేనే ఇప్పుడు ఎవరికైనా పలుకుబడి. అధికారం లేకుంటే ఎంతటి వారైనా సరే చేతులు కట్టుకుని కూర్చుండాల్సిందే. అది అధికారానికి ఉండే మ్యాజిక్. అయితే గత ఎన్నికల్లో వైకాపా కోటలు కూలిపోయాయి. అందులో బొత్స సత్యనారాయణ కోట కూడా కూలింది. అయన కూడా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఆయన తన సొంత నియోజకవర్గం కంచుకోట అయిన చీపురుపల్లి లో టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు చేతిలో ఓడిపోయారు.
అయితే ఉత్తరాంధ్రకు సంభందించి ఓ వార్త ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత తెలుగుదేశం గజపతినగరం ఎమ్మెల్యే, MSME , nri సాధికారత , సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్ళు పట్టుకున్నారు అనేది ఆ వార్త సారాంశం. ఈ న్యూస్ ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ విషయంలో నిజా నిజాలను ఏంటని ? ఆరాతీయగా ఇదంతా ఫేక్ వ్యవహారం అని. కావాలని కొందరు వైసీపీ నాయకులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై అసత్య ప్రచారం చేస్తున్నారు అని తేలింది.
కేవలం మంత్రి పేరు బద్నామ్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని తెలిసింది. యంగెస్ట్ మినిస్టర్ గా ఉత్తరాంధ్రను అభివృద్ధివైపు నడిపిస్తు అధినేత వద్ద పేరు తెచ్చుకుంటున్న సమయంలో అది గిట్టని వైకాపా నేతలు ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపారని మంత్రి వర్గం నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర లో మంత్రి హవా రోజు రోజుకు పెరుగుతోన్న వేళ ఆయన క్రేజ్ అంటే గిట్టని వాళ్లే ఈ ప్రాపగండా చేస్తున్నారని మంత్రి వర్గం ఆరోపిస్తోంది. ఒకవేళ బొత్సని మంత్రి కలిసిన ఫుటేజ్ ఉంటె బయట పెట్టమని సవాల్ చేస్తున్నారు మంత్రి అనుచరులు.