పెళ్లి అయినా వెంటనే ఇస్మార్ట్ జోడీలోకి సోనియా ఆకుల
ఇక సోనియా- యష్ విషయానికి వస్తే.. వీరిద్దరూ పెళ్లి చేసుకుని రెండు రోజులు కూడా కాకుండానే ఈ షోలోకి అడుగుపెట్టారు. అయితే షోలోకి యష్ తో అడుగుపెట్టిన సోనియా మాట్లాడుతూ.. తనలో యష్ కి నచ్చనవి చాలా ఉన్నాయని చెప్పింది. అవి అన్నీ మార్చుకుంటూ తనకు మరింత నచ్చేలా మారుతనని ఆమె చెప్పుకొచ్చింది.
ఇక సోనియా బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ అడుగు పెట్టింది విషయం తెలిసిందే. ఈమె బిగ్ బాస్ హౌస్ లో నాలుగైదు వారాల్లో ఉన్నప్పటికీ చాలా మందికి తెలిసిపోయింది. ఎందుకంటే ఈమె బిగ్ బాస్ హౌస్ లో చేసిన హడావిడి అంతా ఇంత కాదు. సోనియా బిగ్ బాస్ హౌస్ లో తాను యష్ అనే అతనితో లవ్ లో ఉన్నట్లు చెప్పింది. బయటకు వెళ్లాక పెళ్లి చేసుకుంటానని కూడా తెలిపింది. సోనియా ఆకుల ఆర్జీవి సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈమె ఒక స్వచ్చంధ సేవా సంస్థ కూడా నడిపిస్తుంది. ఈమె బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక యష్ ని పెళ్లి చేసుకుని, ఇప్పుడు ఇస్మార్ట్ జోడీ షోలో కి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.