పెన్షన్లకు బ్రేక్.. సీఎం జగన్ ఫెయిల్?

praveen
ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతుంద.  అయితే పథకాలు ప్రజలకు చేరవేయటం విషయంలో కూడా ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చూసుకుంటుంది.  ఈ క్రమంలోనే  ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ ఎంతో సమర్థవంతంగా అదేవిధంగా ఇప్పటికే గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇక వాలంటీర్లు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను కూడా ప్రజలకు అందించడంలో ఎప్పుడు ముందుంటున్నారు..

 అయితే ప్రస్తుతం జగన్ అందిస్తున్న పథకాలలో అటు వృద్ధులు వికలాంగులకు అందించే పెన్షన్ కూడా ఒకటి. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ ఒక్కసారిగా పెంచారు. ఏకంగా 2250 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ప్రతినెల ఖచ్చితంగా ఒకటో తారీకు వరకు ప్రతి ఒక్కరికి పెన్షన్ అదే విధంగా కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. ఇక దీనికి అటు గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్లు పూర్తిస్థాయి తోడ్పాటును అందించడంతో జగన్ ప్రభుత్వం విజయం సాధించింది.

 ఇలా కరోనా వైరస్ సమయంలో కూడా పెన్షన్లను అనుకున్న సమయానికి ఇవ్వడంలో సక్సెస్ అయింది జగన్ ప్రభుత్వం. కానీ ఇటీవల జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఎప్పుడు ఒకటో తారీకు రోజే అందరికీ పెన్షన్ అందించే ప్రభుత్వం ఈసారి మాత్రం అలా చేయలేక పోయింది. ఇటీవల ఏకంగా ఐదు లక్షల మంది పెన్షనర్లకు ఒకటో తేదీన జగన్ ప్రభుత్వం అనుకున్న విధంగా పెన్షన్ అందించలేకపోయారు. ఈ క్రమంలోనే రెండవ తేదీ రోజు కొంత మంది లబ్ధిదారులకు ఇక మూడవ తేదీ ఈరోజు మరి కొంత మంది లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తూ వస్తుంది జగన్ ప్రభుత్వం. దీనికంతటికీ కారణం చంద్రబాబు రఘురామకృష్ణంరాజు లాంటివాళ్ళు ఇక ఏపీ ప్రభుత్వానికి ఎక్కడ అప్పులు ముట్టకుండా చేయడమే అని అంటున్నారు విశ్లేషకులు.  ఇలా చేయడం వల్ల ఇక పెన్షన్లు ఆగిపోవడం, సంక్షేమ పథకాలు ఆగిపోవడం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై  వ్యతిరేకత తీసుకురావడమే ప్రతిపక్షాలు లక్ష్యం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: