కాంగ్రెస్ పార్టీ కొత్త రథసారధిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని రాజకీయాలు చాలా మారిపోయాయి. కొత్త కొత్త మార్పులు చోటు చేసు కుంటున్నాయి. రేవంత్ తనమార్కు రాజకీయంతో చాప కింద నీరులా కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యాన్ని పెంచుతున్నారని చెప్పవచ్చు. మొన్నటి వరకు కాంగ్రెస్, బిజెపి, ఇతరాత్రా పార్టీలు తమ పార్టీలో 2023లో గద్దె ఎక్కుతాయి అని ప్రకటనలు కూడా చేశాడు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టుకున్న తర్వాత 2022 కల్లా టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని, 2022 లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని ధీమాగా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి పదేపదే 2022 అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పడం వెనుక సాధారణ అసెంబ్లీ ఎన్నికలు 2022 లోనే వచ్చేట్టు కనబడుతోంది.
మనందరికీ అనుమానం రావచ్చు. ఎందుకంటే 2023 లో కదా అసెంబ్లీ ఎన్నికలు వచ్చేది. కానీ దానికోసం రేవంత్ పక్కా ప్రణాళికను రూపొందించి 2022లో తెరాస ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ముందుగానే ప్రణాళిక రూపొందించారు. అంటే తాను తవ్వుకొన్న గోతిలో తానే పడ్డట్టుగా కెసిఆర్ మొదలు పెట్టిన ఆకర్ష్ ఆపరేషన్ ఆయన మెడకు చుట్టుకుంటుందని విశ్వసనీయ సమాచారం.
సీఎం కేసీఆర్ గత ఏడు సంవత్సరాల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అమలు చేస్తున్న మంత్రం 2014 నాలుగు సీట్లు ఉన్న టిఆర్ఎస్ అధికారంలోకి రావడమే. బీఎస్పీ పార్టీ గుర్తుతో గెలిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలైన కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డిలతో మొదలుపెట్టిన, టిడిపిలో గేలిచినటువంటి 15 మంది ఎమ్మెల్యేలలో, 11 మందిని తన వలలో వేసుకున్నాడు. కాంగ్రెస్ మెజారిటీ ఎమ్మెల్యేలను కూడా తన వైపుకి లాక్కున్నాడు. సీపీఐ నుంచి గెలిచిన ఇటువంటి ఏకైక ఎమ్మెల్యే కూడా టిఆర్ఎస్ లో విలీనం చేసుకున్నాడు. ఇంకా 2018 లో 88 సీట్లు మెజారిటీ సాధించిన కెసిఆర్ మాత్రం ఆపరేషన్ ఆకర్షణను ఆపలేదు. ప్రభుత్వ ఏర్పాటు సరిపడా బలం ఉన్నా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను లాగేసి నప్పుడు కూడా కెసిఆర్ పై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
కానీ ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఆయనకే స్ట్రోక్ ఇవ్వనుందని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తామని కెసిఆర్ ఆలోచన ఆయన మెడకే పాములా చుట్టుకుంది. సేమ్ అదే బాటలో రేవంత్ రెడ్డి కూడా పార్టీలో గెలిచి వెళ్లిపోయినటువంటి నాయకులను లాక్కునే ముమ్మరంగా చేస్తున్నారు. ఎందుకంటే అంతకు ముందు టిడిపిలో గెలిచినఅటువంటి ఎమ్మెల్యేలంతా రేవంత్ కు పాత పరిచయస్తులే. కాబట్టి వీరందరినీ తనదైన మార్కు రాజకీయంతో పార్టీలోకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నదని, సమాచారం అందుతోంది.