తగ్గేదేల్యా : మరో వివాదంలో జగన్ !
వివాదాలేమీ కొత్తవి కావు
పాతవీ కావు
కేంద్రం ఒప్పుకోలు లేనివి
మోడీ మెప్పు పొందలేనివి
అన్నీ జగన్ చేస్తుండడం
అసలు కారణం కానీ
ఇందుకు మరో అంశం కూడా
దోహదం.
అన్నీ రాజ్యాంగ విరుద్ధాలే కావు
కానీ కేంద్రం తన పెత్తనం వదులుకోదు
కనుక ఆ మాత్రం అయినా నియంత్రణ
కేంద్రానికి జగన్ కు మధ్య దూరం పెరుగుతోంది.. కొన్ని విషయాలు రాజ్యాంగ విరుద్ధం అని కూడా తేల్చేస్తుంది. ఈ నేపథ్యంలో అప్పులు పుట్టక తలబాదుకుంటున్న ప్రభుత్వానికి కొత్తగా ఏం చేయాలో తోచక కేంద్రంతో త గువు పెట్టుకోలేక నడి సంద్రంలో నావలా ఉండిపోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని కేంద్రం చెప్పడం, ఇందుకు సంబంధించి వివరాలు ఆరా తీయడం చకచకా జరిగిపోతున్నాయి. ఈ వి వాదం రేగేందుకు కూడా టీడీపీ పెట్టిన చిచ్చే కారణం అని వైసీపీ ఆరోపిస్తుంది. రుణాల సేకరణలో భాగంగా నిర్దేశించుకున్న 21,500 కోట్ల రూపాయలకు సంబంధించి కార్పొరేషన్ ద్వారా పావులు కదపడం, సంబంధిత వ్యవ హారాలను శాసనసభకు చెప్పకపోవడం అన్నవి ప్రధాన సమస్యలుగా చూపిస్తూ టీడీపీ చేసిన ఆరోపణే ఆధారంగా అసలు ఈ కార్పొరేషన్ ఏర్పాటు అన్నదే రాజ్యాంగ విరుద్ధం అని తేల్చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వి వరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది.
మొత్తానికి ఈ వివాదం కారణంగా బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ వేసిన ఎత్తుగడ ఒకటి ఫలించింది. అలానే పయ్యావుల కేశవ్ చెప్పిన మాటలపై వైసీపీ వివరణ ఇచ్చేలా చేసింది. దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన ఇప్పటికే మా ట్లాడినప్పటికీ కేంద్రం మాత్రం రాజ్యాంగ ధిక్కరణ అనే అంశాన్ని మాత్రమే పరిగణించిందని తెలుస్తోంది. అదేవిధంగా రేపటి వేళ ఎక్సైజ్ పై వచ్చే ఆదాయాన్ని ముందుగానే తాకట్టు పెట్టేందుకు 10 మద్యం డిపోలకు సంబంధించి ఎస్క్రో విధించడం తగదని కూడా కేంద్రం చెప్పిందని టీడీపీ పేర్కొంది. ఇది కూడా తాము రైజ్ చేసిన పాయింటేనని చెబుతోంది. దీంతో కేంద్రానికి ఏం చెప్పాలో, రుణాల సేకరణకు ఏ మార్గం ఎంచుకోవాలో అన్నది ఇప్పుడిక అ త్యవసర విషయమై ఉంది. కానీ పొలిటికల్ సర్కిల్స్ మాత్రం కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సిసలు వివాదానికి కారణం టీడీపీనే అని పేర్కొంటున్నాయి. అప్పులు తేనిదే రాష్ట్రం నడవదు అని తెలిసి కూడా ఇలాంటి సమయంలో కూడా కేవలం తమపై బురదజల్లే పనులు చేయడం తప్ప సర్కారు పనితనానికి ఊతమిచ్చే పనులు టీడీపీకి చేతగావు అని వైసీపీ వర్గం మండిపడుతోంది. తాము నిబంధనల మేరకు నడుచుకుంటామని కూడా పదే పదే చెబుతోంది.