గర్భిణుల విషయంలో ఏపీ మరో రికార్డ్ !

NAGARJUNA NAKKA
భారత దేశవ్యాప్తంగా గర్భిణులకు వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 20లక్షల మందికిపైగా తల్లులకు వ్యాక్సిన్లు వేయగా.. రాష్ట్రవ్యాప్తంగా రెండుకోట్ల డోసులు వేసిన 10రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. తమిళనాడు 78వేల 839మంది గర్భిణులకు వ్యాక్సిన్ వేసి తొలిస్థానంలో ఉండగా.. 34వేల 228మందికి వ్యాక్సిన్ వేసి ఏపీ రెండో స్థానంలో నిలిచింది.
మరోవైపు మాస్కులేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. మాస్కు లేకుండా రానిచ్చే కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలకు రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా వేస్తామని.. రెండు రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. మాస్కు ధరించని వారికి 100రూపాయలు ఫైన్ వేస్తామంది.

కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల కారణంగా వైద్య వ్యవస్థను మెరుగుపర్చుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కొవిడ్-19 అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థ తయారీ ప్యాకేజీ కింద.. 1,827కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ ప్యాకేజీ మొత్తం రూ.12,185.30కోట్లు కేటాయించగా.. అందులో 15శాతం నిధులు విడుదల చేశారు. వీటిలో ఏపీకి రూ.62.69కోట్లు, తెలంగాణకు రూ.44.80కోట్లు వచ్చాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ కు రూ.281.9కోట్లు కేటాయించారు.
భారత్ లో కొత్తగా 41వేల 831కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక మరో 541మంది కరోనాతో కన్నుమూశారు. మరోవైపు గడిచిన 24గంటల్లో 39వేల 258మంది కోలుకోగా.. రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం కేసులు 31, 655, 824 ఉండగా.. యాక్టివ్ కేసులు 4లక్షలా 10వేల 258ఉన్నాయి. ఇక కోలుకున్న వారు 3కోట్ల 8లక్షల 20వేల 521మంది ఉన్నారు. మొత్తం మరణఆల సంఖ్య 4లక్షల 24వేల 351కి చేరింది. భారత్ లో థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్న భయంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు ఆరోగ్యపరంగా తీసుకునే జాగ్రత్తలపై సూచనలు చేస్తోంది. అటు ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటించాలంటోంది.





 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: