ఆడు ఆడించు : ద‌ర్యాప్తు సంస్థ‌ల‌న్నీ బొమ్మ‌లేనా!

RATNA KISHORE
ఆడు ఆడించు : ద‌ర్యాప్తు సంస్థ‌ల‌న్నీ బొమ్మ‌లేనా!


ఇప్పుడు కాదు కానీ చాలా రోజుల కిందట సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌ను ఓ క్వ‌శ్చ‌న్ అడిగారు చాలా మంది మీడియా ప్ర తినిధులు..జ‌గ‌న్ కేసుల గురించి చెప్పండి అని! ఆయ‌న ప‌ద‌వి నుంచి వ‌దిలివ‌చ్చిన వాడిని ఇక వాటిపై మాట్లాడను అని ఆయ‌న త‌ప్పించుకున్నారు. ఆ త‌రువాత ఆయ‌న ఆ కేసుల గురించి ఎందుక‌నో మాట్లాడ‌లేదు. ఆ వ్యూహాత్మ‌క మౌనం ఎవ్వ‌రికీ అర్థం కా లేదు కూడా! రాజ‌కీయంగా ఆయ‌న స‌క్సెస్ కాలేక‌పోయినా, ఈ కేసుల‌పై గొప్ప పోరాటం చేసిన వ్య‌క్తిగా పేరు తెచ్చుకు న్నార‌ని అప్ప‌ట్లో చాలా మంది అభిమానులు ఏర్ప‌డ్డారు. కానీ ఆ స్పీడ్ రాజ‌కీయంలోకి వ‌చ్చాక ఆయ‌న‌లో లేదు. అంటే ఆ రోజు ఆ కేసు లు అన్నీ సోనియా హ‌యాంలో న‌డిచాయా? లేదా జేడీ చెప్ప‌కుండానే దాట వేయ‌డం వెనుక ఏమ‌యినా ప్ర‌మాదం దాగి ఉందా? అయితే అది ప్రాణ హాని కావొచ్చా? ఇలాంటి సందేహాలే చాలా మంది మ‌దిలో మెదిలాయి. కానీ అనూహ్యంగా జ‌గ‌న్ కేసుల్లో ఈడీ స్పీడ్ త‌గ్గింది. సీబీఐ స్పీడ్ త‌గ్గింది.. ఇంకా చాలా ద‌ర్యాప్తు సంస్థ‌ల వేగం త‌గ్గింది. అంటే ఇలాంటివి అన్నీ ఎవ‌రి ఉనికి ని వారు కా పాడుకునేందుకు, పార్టీల‌కు అనుగుణంగా ఉండేందుకు మాత్రమే ఉప‌యోగించుకుంటార‌న్నది తేలిపోయింది. కానీ ఇప్పుడు జేడీ కానీ జ‌గ‌న్ కానీ ఎవ్వ‌రు కానీ నాటి ప‌రిణామాలు గుర్తు తెచ్చుకుంటే ఒక‌నాటి ఉత్కంఠ గుర్తు రాక మాన‌దు. మోడీ అధికారంలోకి రాగానే కొన్ని కేసుల ద‌ర్యాప్తు కూడా ఇలానే మంద‌గించింది. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ త‌న అవ‌స‌రం కోసం ఏదో మాట్లాడుతుండవ చ్చు గాక కానీ ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప్ర‌భావితం చేసేవి అన్నీ రూలింగ్ పార్టీలే! నాడు జ‌గ‌న్ కూడా తాను సోనియా మాట విన‌నందు కే అక్ర‌మ కేసులు బ‌నాయించి త‌న‌నూ, త‌న కుటుంబాన్నీ వేద‌న‌కు గురిచేశార‌ని, తాను త‌లొగ్గి  ఉంటే  నాటి ప‌రిస్థితి  వేరేగా ఉం డేద‌ని అనేవారు. కాల‌గ‌తిలో సోనియా గాంధీ పార్టీ రూలింగ్ లో లేకుండా పోయింది. అదేవిధంగా ఏపీలో టీజీలో కాంగ్రెస్ కు రోజు ల్లేకుండా పోయాయి. కానీ ఏసీబీ రాష్ట్రం చెప్పిన విధంగా, సీబీఐ కేంద్రం చెప్పిన విధంగా  త‌న ప‌ని తాను చేసుకుపోతుందని ఇప్ప టికీ విమ‌ర్శ‌లు ఉన్నాయి. అలానే ఇప్పుడు ఈ ఓటుకు నోటు కేసు కావొచ్చు అని కొన్ని రాజ‌కీయ వ‌ర్గాల అభిప్రాయం.

 

న‌ట‌న తెలిస్తే చాలు నాట‌కం ర‌క్తి క‌ట్ట‌వ‌చ్చు..క‌థ ఎవ్వ‌రిది క‌థ‌నం ఎవ్వ‌రిది అన్న‌ది ప‌ట్టించుకోకుండానే చూడొచ్చు.ఇప్పుడు రాజి కీయ తెర‌పై ద‌ర్యాప్తు సంస్థ‌ల‌న్నీ అలాంటివే..వాటికి ఉన్న నిబ‌ద్ధ‌త క‌న్నా అవి రాజ‌కీయ నే త‌లు ఆడ‌మ‌న్న విధంగా ఆడ‌డ‌మే  ఓ వింత. అందుకు ఏసీబీ, సీబీఐ, ఈడీ ఏవీ అతీతం కావు. క‌నుక కొన్ని కేసులు ఒకంత‌ట తేల‌వు. శ‌త్రువుగా ఉన్న‌ప్పుడు ఓ విధం గా లేన‌ప్పుడు మ‌రో విధంగా అవి ప్ర‌వ‌ర్తించే తీరే ఆ శ్చ‌ర్య‌క‌రం. తాజాగా రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఓటు కు నోటు కేసు నే ఉ దాహర‌ణ‌గా తీసుకుందాం. ఈ కేసును సాక్షి మీడియా ఎంత‌గా వాడుకుందో అంద‌రికీ తెలుసు. కానీ ఇప్పుడు అధికారం ద‌క్కింది క‌దా!కనుక ఆ ఊసే ఉండ‌దు. అలానే నాడు జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులకు సంబంధించిన వివ‌రాలు అన్నీ ఈనాడు త‌నదైన ద‌ర్యా ప్తు చేసి క‌థ‌నాలు వండింది. ఇప్పుడు జ‌గ‌న్ పై రాసే సాహ‌స‌మే లేదు. ఇలా మీడియాకూ, కేంద్రానికి, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కూ ఒక్క  టేంటి అ న్నింటికీ అవ‌కాశ‌వాదం ఒక్క‌టే ప‌ర‌మావ‌ధి. ఈనాడు స్వామి భ‌క్తి,సాక్షి స్వామి భ‌క్తి, కేసీఆర్ ప్రేమ, మోడీ అందించే ప్రేమ వేర్వేరుగా ఉన్నా అవ‌న్నీ అవ‌స‌రార్థ ప్రేమ‌లే!అవుతాయి... వ్య‌క్తుల‌పై నా,వ్య‌వ‌స్థ‌ల‌పైనా అన్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: