ఆ దేశంలో రంగుమారిన చంద్రుడు.. ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు..!

Suma Kallamadi
విశ్వంలో జరిగేవి మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి. కొన్ని కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు విశ్వంలో మనకు చాలానే కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మన కంటికి కనిపిస్తాయి. కొన్ని మనము చూడలేము. అయితే తాజాగా ఖగోళంలో ఓ అద్భుత ఘటన జరిగింది. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే రేఖలోకి వచ్చినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడు, శని గ్రహం రెండు కూడా పక్కపక్కనే మనకు దర్శనమిస్తాయి. రెండు గ్రహాలు పక్కపక్కకే రావడాన్ని మనం గమనించవచ్చు. ఇలా గ్రహాలు పక్కపక్కకే రావడాన్ని మనం బైనాక్యులర్స్‌ ద్వారా చూసే అవకాశం ఉంది. జూలై నెలలో వచ్చేటటువంటి పౌర్ణమి కాంతికి ప్రత్యేకత ఉంది. ఆ రోజు చంద్రుడిని బక్‌ మూన్‌ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా ఇలాంటి సమయంలో ఎక్కువగా ఉరుములు, పిడుగులు అనేవి పడుతుంటాయి. అందుకే దీనిని థండర్‌ మూన్‌ అని అంటారు. ఈ సమయంలో చంద్రుడి రంగు ఎరుపు, నారింజ రంగులు కలిసిపోయి ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
 తాజాగా అమెరికాలో వింత ఘటన జరిగింది. పౌర్ణమి రోజున చంద్రుడు తెలుపు రంగుతో కనిపించకుండా వేరే రంగులో కనిపించాడు. ఒక్కసారిగా చంద్రుని రంగు మారిపోయింది. అమెరికాలో చంద్రుడు ిప్రజలకు నారింజ రంగులో కనిపించాడు. ఇప్పుడు చంద్రడు ఇలా కనిపిస్తున్న రంగులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమెరికాలో ఉన్నటువంటి ఒరెగాన్, మోంటానా, ఐడహో, కాలిఫోర్నియా, నెవాడా రాష్ట్రాల్లో ఓ వింత వాతావరణం నెలకొంది. ఈ ప్రాతాల్లో ఆకాశంలో దట్టంగా పొగ అనేది అలముకుంది. అదే సమయంలో చంద్రుడు అక్కడున్న ప్రాంతాల్లో నారింజ రంగుతో కనిపించాడు. చంద్రుడ్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. నారింజ రంగులోని చంద్రుడిని చూసి వారు ఎంతో ఆశ్చర్యపోయి ఫోటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నారింజ రంగుతో ఉన్నటువంటి చంద్రుడు ఫోటోలు వైరల్ గా మారి హల్ చల్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: