వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. దీనికోసమో తెలుసా?

praveen
సాధారణంగా ఒక పార్టీ కార్యకర్తలు నాయకులు అన్నప్పుడు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారు. ఎలాంటి వివాదాలు రాకుండా కలిసికట్టుగా ముందుకు సాగుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఆధిపత్య పోరులో భాగంగా ఏకంగా ఒకే పార్టీలో నేతల మధ్య వివాదాలు చెలరేగుతుంటాయి. ఈ క్రమంలోనే ఇక ఒకే పార్టీకి చెందిన కార్యకర్తలు నేతలు రెండు గ్రూపులుగా ఏర్పడి పొట్లాడుతూ ఉంటారు. ఇక ఇటీవల ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ లో ఇలాంటివి రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.  వైసీపీలోనే కార్యకర్తలే రెండు గ్రూపులుగా ఏర్పడి ఘర్షణ చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇక ఇటీవల చిత్తూరు జిల్లాలో కూడా ఇలాంటిదే జరిగింది.

 ఇటీవలే చిత్తూరులోనే గంగాధర నియోజకవర్గంలో వైసీపీలో నేతలు రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. ఈ క్రమంలోనే వారి మధ్య ఫ్లెక్సీల కు సంబంధించి గొడవ జరిగింది గొడవ కర్త మాటా మాటా పెరగడంతో చివరికి ఘర్షణకు దారితీసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన చోటే మరొక గ్రూపు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఈ గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. వైసిపి నేత ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్ విజయ్ ఆనంద్ రెడ్డి పుట్టిన రోజు నేపథ్యంలో ఇక ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

 ఏకంగా ఆయన దృష్టిని ఆకర్షించడానికి ఎంతోమంది ఇక వైసీపీ కార్యకర్తలు అందరూ పోటీపడి మరీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇక అందరూ ఒకే చోట ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో ఇది కాస్త చివరికి గొడవకు దారి తీసింది. యువకుల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ నాయకుడి జన్మదినం సందర్భంగా ఒకే దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అనుకోవడంతో ఈ గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది. చివరికి ఈ వ్యవహారం పోలీసుల వరకూ వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇక అక్కడ ఘర్షణ పడుతున్న యువకులను చెల్లాచెదురు చేసి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: