టైం కోసం వెయిట్ చేస్తోన్న టీడీపీ అన్నదమ్ములు ?
ఈ విషయంలో రెండో మాట కూడా లేదు. అనేక మంది కీలక నేతలను పార్టీలో చేర్పించి ..పార్టీ అభ్యున్నతికి కూడా కృషి చేశారు. ఈ క్రమంలోనే ఒంగోలు నగరానికి స్వచ్ఛ అవార్డులు కేంద్రస్తాయిలో దక్కాయి. అయితే.. 2019 ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ ఓడిపోయారు. వైసీపీ సునామీ కారణంగా.. పార్టీ ఓడిపోయింది. ఈ క్రమంలో అప్పటి నుంచి సైలెంట్‌గా ఉంటున్నారు. అయితే.. ప్రజల్లో మాత్రం ఈ సోదరులవిషయంలో ఎలాంటి వివాదం లేదు. ఎందుకంటే.. వారు అధికారంలో ఉన్నప్పుడు.. నియోజకవర్గానికి చేసిన అభివృద్ధే ఇప్పటికీ కొనసాగుతోంది. వైసీపీ తరఫున ఎంతమంది గెలిచినా.. ఇక్కడ అభివృద్ధి మాత్రం పట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
పైగా వైసీపీకి ఓటు వేయలేదని.. ఓ మంత్రి ఆదేశాల నేపథ్యంలో చాలా మంది పింఛన్లు కట్ అయ్యాయి. అదేసమయంలో చేయూత పథకాన్ని కూడాచాలా మందికి నిలిపివేశారు.. దీంతో ఆయా వర్గాలు.. మళ్లీ టీడీపీ ఉంటే బాగుండేదని అంటున్నాయి. అదేసమయంలో ఎప్పుడూ స్వచ్ఛ అవార్డు గెలుచుకున్న ఒంగోలు.. ఈదఫా అవార్డు కనుసన్నల్లో కూడా రాలేక పోయింది. దీనికి కూడా వైసీపీ నేతలే కారణమనే వాదన వినిపిస్తోంది. అంటే.. ఇక్కడ దామచర్ల వర్గం.. ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేయకపోయినా.. వారికి అనుకూలంగా ఇక్కడి పరిణామాలు మారుతుండడం గమనార్హం.
అయితే.. పార్టీలో మాత్రం స్తబ్దత కొనసాగుతోంది. కేడర్‌లో ఒకింత ధైర్యం నింపితే.. పుంజుకోవడం పెద్ద కష్టం కాదని.. అంటున్నారు. పార్టీ అదినేత చంద్రబాబు ఇస్తున్న పిలుపుతో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారామళ్లీ అవకాశం దక్కించుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే.. ఎన్నికలకుముందు కాకుండా.. ఇప్పటి నుంచే పార్టీని లైన్‌లో పెట్టుకుంటే మంచి దనే సూచనలు వస్తున్నాయి.
అదేసమయంలో యూత్‌ను కూడా గతంలో మాదిరిగానే.. తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేయాలని అంటున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీలో వినిపిస్తున్న ఆధిపత్య రాజకీయాలు టీడీపీకి మేలు చేస్తాయని... దీనిని అందిపుచ్చుకోవాలని సూచనలు వస్తున్నాయి. కానీ, వీటిని మాత్రం దామచర్ల సోదరులు పట్టించుకోవడం లేదని.. సమయం కోసం వేచి చూస్తున్నారని టాక్ ప్రబలంగా వినిపిస్తుండడం గమనార్హం.