వాళ్ల ఆటలు సాగవు..!
ఇదిలా ఉంటే చైనా తమ సైన్యాన్ని లఢక్ ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. గతేడాది ఆ ప్రాంతంలో మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు జరిగిన ఘటనలో మనదేశానికి చెందిన జవానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మూడు నెలల పాటు ఉద్రిక్తతలకు దారితీసింది. ఎన్నో చర్చోపచర్చలు.. ఒత్తిళ్లు.. ఇతర దేశాలతో మనకున్న సపోర్ట్ తో చైనా తోకముడచాల్సి వచ్చింది. ఇదిలా ఉండగానే ఇటీవల డ్రోన్లు సరిహద్దుల్లో కలకలం రేపాయి.
జమ్ముకశ్మీర్ లో డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. మన దేశ సరిహద్దులు దాటడానికి వీలులేక పోవడంతో.. డ్రోన్లను వినియోగించుకుంటున్నారు ఉగ్రవాదులు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తంగానే ఉంటున్నాయి. తొలిసారిగా జూన్ 27వ తేదీ జమ్ము విమానాశ్రయంలో బాంబు దాడులకు ప్రయత్నించారు. అయితే పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. స్వల్ప నష్టం జరిగింది. అప్పటి నుంచి డ్రోన్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మన జవాన్లు కంటిమీద కనుకులేకుండా కాపలా కాస్తున్నారు. ఉగ్రవాదుల పన్నాగాలన్నింటినీ పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో కంచెలు లేని చోట కంచెలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అంతేకాదు యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. దేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న రక్షణ చర్యలు సత్ఫలితాలివ్వాలని భారత పౌరుడు, పౌరురాలిగా మనమందరమూ కోరుకుందాం. భారత్ మాతాకీ జై..! జై జవాన్..!