సెకండ్‌వేవ్ సమయంలో పెరిగిపోయిన నిరుద్యోగుల కష్టాలు..?
అయితే ప్రస్తుతం కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్న యువతీయువకులల్లో 32 శాతం మంది శాలరీ కట్ ఫేస్ చేస్తున్నారు. 25 శాతం మంది యువత తమ ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో 90 శాతం మంది ఉద్యోగ దరఖాస్తులు నిరుత్సాహ పడుతున్నారు. ప్రతిభా ఆధారిత నియామకాలు చేపట్టాలని.. తాము ఎన్నో నైపుణ్యాలు నేర్చుకుంటున్నానని యువతీ యువకులు చెబుతున్నారు. అంతేకాకుండా, టెక్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టైమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్, సమర్థవంతమైన కమ్యూనికేషన్ వంటి సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోవడానికి 60% ఇండియన్స్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వే తెలిపింది.
లింక్డ్ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ అశుతోష్ గుప్తా మాట్లాడుతూ.. సర్వే ఫలితాలు చూసిన తర్వాత తాను బాధ పడ్డానని వెల్లడించారు. కంపెనీలు తమ నియామక ప్రక్రియను వెంటనే వైవిధ్యపరచాలని, ప్రతిభావంతమైన యువకులను నియమించుకోవాలని ఆయన కోరారు. ఇకపోతే సాధారణ సమయాల్లోనే అనుభవం లేని యువతకు ఉద్యోగాలు దొరకడం దాదాపు అసాధ్యంగా మారింది. ఇక కరోనా వైరస్ భారతదేశంలో వ్యాప్తి చెందిన తర్వాత యువ నిరుద్యోగులకు జాబ్ దొరకడం మరింత క్లిష్టతరం గా మారింది. వ్యాపారాలు బాగా దెబ్బతినడంతో కంపెనీలు పరిమిత ఉద్యోగస్తులతో సరిపెట్టుకుంటున్నాయి. అంతేకాకుండా జీతాలలో కోతలు విధిస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఫ్రెష్ క్యాండిడేట్స్ కి ఉద్యోగాలు రావడం తీరని కలగానే మారుతోంది. ఎంతో టాలెంట్ ఉండి కూడా చాలా మంది యువతీ యువకులు ఉద్యోగాలు సంపాదించే మొదటి దశలోనే విఫలమవుతున్నారు. దీనికి కారణం యజమానులు కొత్తవారిని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పుకోవచ్చు.