రేవంత్ ఎఫెక్ట్... కాంగ్రెస్‌లోకి ఇద్దరు ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ?
వారిద్దరు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అని సమాచారం. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ఒక యువ ఎమ్మెల్యేకు రేవంత్ రెడ్డి సిఫార్సు తోనే కాంగ్రెస్ టిక్కెట్ దక్కింది. ఆనాడు రేవంత్ రాహుల్ గాంధీ ద్వారా రేవంత్ లాబీయింగ్ చేసి సదరు ఎమ్మెల్యే కు సీటు ఇప్పించ గా సదరు ఎమ్మెల్యే విజయం సాధించాక కారెక్కేశారు. ఇక రేవంత్ తో ఎంతో సాన్నిహిత్యం ఉన్న మరో పార్టీకి చెందిన ఎమ్మెల్యే సైతం ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
సదరు ఎమ్మెల్యేకు ఏపీలో టీడీపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన టీడీపీ వీరాభిమాని. ఈ క్రమంలోనే టిడిపి - రేవంత్ కంబైన్డ్ లాబీయింగ్ ద్వారా ఆయన పార్టీ మారాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వీరిద్దరి పై ఇప్పుడు కారు పార్టీలో చాలా అనుమానాలు కూడా మొదలవుతున్నాయట. ఈ విషయం పార్టీ అధిష్టానంకు తెలియడం తో వారిని బుజ్జగించే ప్రక్రియ కూడా మొదలైందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.