2023లో కేసీఆర్‌కు సరైన ప్రత్యర్థి ఎవరు.. సర్వే చెప్పిన షాకింగ్ లెక్కలు ?
ఇక బండి సంజయ్ కూడా తెలంగాణ అంతటా పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇలా ఒకరు కాదు... ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు నేతలతో కేసీఆర్ పోటీ పడాల్సి ఉంది. ఇక పదేళ్లుగా అధికారంలో ఉండడం తో వ్యతిరేకత ఉందన్న మాట కూడా వాస్తవం. ఈ క్రమంలోనే 2023 ఎన్నికల్లో తెలంగాణ లో కేసీఆర్‌ను ఢీ కొట్టి గట్టి ప్రత్యర్థిగా నిలబడేది ఎవరు ? అన్న అంశంపై తాజాగా జరిగిన సర్వేలో అందరూ ఊహించిన ఫలితమే వచ్చింది. కేసీఆర్ ను ఢీకొట్టే నేతగా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డినే కరెక్ట్ అని భావిస్తున్నారు.
కేసీఆర్ కు సరైన ప్రత్యర్థి రేవంత్ రెడ్డి అని ఏకంగా 66.15 శాతం మంది చెప్పారు. బండి సంజయ్‌ను కేసీఆర్ కు ధీటైన ప్రత్యర్థిగా ప్రజలు భావించడం లేదు. సంజయ్ కు కేవలం 15 % ఓట్లు మాత్రమే పడ్డాయి. కేసీఆర్‌కు సంజయ్ ఏ మాత్రం సరితూగరని చెప్పేశారు. ఇక షర్మిలకు 5 శాతం ఓట్లు కూడా రాలేదు. అసలు తెలంగాణలో షర్మిల పార్టీ ప్రభావం ఏ మాత్రం ఉండదని సర్వే ఫలితం చెప్పేసింది. ఇక షర్మిల పార్టీ ప్రభావం ఖమ్మం, నల్లగొండ, గ్రేటర్‌లో కొన్ని చోట్ల మినహా అసలు తెలంగాణలో ఎక్కడా ఉండదని చెప్పేస్తున్నారు.