బాబోరి రేవంత్ కేసీఆర్ ను ఉరికించగలడా ?

VAMSI
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కేసీఆర్ ఏ ఉద్యమాన్ని అయితే అడ్డు పెట్టుకుని ప్రత్యేక తెలంగాణ సాధించి గద్దెనెక్కారో ? ఇప్పుడు ఆ పదవికే చిల్లు పడేలా ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికి కారణం రోజు రోజుకీ మారుతున్న రాజకీయ సమీకరణాలే ? కొద్ది రోజుల క్రితమే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. మరో వైపు హుజురాబాద్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ కేసీఆర్ పై కాలు దువ్వుతోంది. ఇక వైఎస్సార్ వారసురాలిగా తెలంగాణ బిడ్డగా పార్టీని స్థాపించి కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా అడుగులేస్తున్న షర్మిల వ్యూహాత్మకముగా పావులు కదుపుతోంది. ఇలా కేసీఆర్ ను మరియు తెరాస ను తుంగలో తొక్కడానికి మిగిలిన పార్టీలన్నీ ఒకటిగా కాకపోయినా వేర్వేరుగా కేసీఆర్ నే లక్ష్యంగా పెట్టుకున్నాయి. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ సీఎం పదవిని ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు. పాలనలో ఎన్ని పొరపాట్లున్నా ప్రజలు ఏమీ చేయలేరు కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు కేసీఆర్ కు దినదినగండంగా మారిందని పొలిటికల్ అనలిస్ట్స్ అనుకుంటున్నారు.

ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ తో ఎటువంటి ప్రమాదం లేదని ఎంతో ధీమాగా ఉన్నప్పటికీ, రేవంత్ రాకతో ఒక్కసారిగా కేసీఆర్ కు గతం గుర్తొస్తోంది. దీనితో ప్రగతి భవన్ ను వదిలి పెట్టి ఇన్నాళ్లు పడుకున్న ముసలి నిద్రను విడిచి పెట్టి ప్రజల వద్దకు పేరుగెతాల్సిన పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక్కో వ్యాఖ్య కేసీఆర్ గుండెల్లో గుచ్చుకుంటోందని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. ఇక త్వరలోనే రేవంత్ పాదయాత్ర మొదలు పెట్టనుండగా, కేసీఆర్ ఇక అన్నీ సర్దుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాడు. కేసీఆర్ గురించి పూసగుచ్చినట్లు పాదయాత్రలో ప్రజలకు చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటి వరకు అమాయక ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి గద్దెనెక్కి, అమలు చేయని హామీలన్నింటి గురించి కేసీఆర్ ను ప్రశ్నించనున్నాడు. అంతే కాకుండా రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కేసీఆర్ కు ధీటుగా, నోటిలో రాయిగా నిలబడుతాడని అందరూ అనుకుంటున్నారు.

ఇటీవల ఒక వెబ్ మీడియా ఛానల్ జరిపిన సర్వే లో కూడా ఈ సారి ఎన్నికల్లో కేసీఆర్ కు సరైన ప్రత్యర్థి రేవంత్ రెడ్డి అని దాదాపుగా 70 శాతం మంది వరకు అభిప్రాయపడుతున్నట్లు ఈ సర్వే లో వెల్లడైంది. కేసీఆర్ ను నిలువరించడంలో బీజేపీ పెద్దగా సఫలమవుతుందని ప్రజలు భావించేలా కనిపించడం లేదు. దీనితో కేసీఆర్ ను ప్రగతి భవన్ నుండి ఉరికించగలడన్న నమ్మకం ప్రజల్లో బలంగా పాతుకుపోయి ఉంది. దీనికి తోడు రేవంత్ రెడ్డి కూడా తన బలమైన వ్యాఖ్యలతో అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి అనుకున్నంత పని చేస్తాడా ? కేసీఆర్ ను గద్దె దింపుతాడా ? ఈ ప్రయత్నంలో ప్రజలు ఎంతవరకు రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలుస్తారన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: