క‌రోనా గురించి ప్ర‌పంచ‌మే ఊపిరి పీల్చుకునే న్యూస్ వ‌చ్చింది...!

VUYYURU SUBHASH
దాదాపు మూడు సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా మహమ్మారి. ధ‌న‌వంతులు -పేదవాళ్ళు - పారిశ్రామికవేత్తలు - ప్రధానమంత్రులు - దేశ‌ అధ్యక్షులు - సినిమా వాళ్ళు - వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా కరోనా అందరినీ ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది. ఎవరైనా స్వేచ్ఛగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి. ప్రపంచంలో ప్రతి ఒక్కరి స్వేచ్ఛకు బ్రేక్ వేసిన కరోనా అందరిని ఇళ్ళల్లో కూర్చో పెట్టేసింది. రెండేళ్లుగా ప్రభుత్వాలు క‌రోనా ను కట్టడి చేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం ఉండటం లేదు.

ఇక ప్రజలు సైతం విచ్చలవిడిగా తిరుగుతూ కరోనా మరింతగా విజృంభించ‌డానికి కారకులవుతారు. తొలి ద‌శ‌లో కరోనా ప్రభావం పెద్దగా లేకపోయినా రెండో దశలో మాత్రం ఎంతో మంది బలైపోయారు. మనదేశంలో కూడా కరోనా రెండోదశ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఎంతో మంది సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా ధాటికి బలైపోయారు. నిన్నమొన్నటి వరకు రెండో ద‌శ దెబ్బ‌కు అల్లాడిపోయిన జనాలకు ఇప్పుడిప్పుడే కాస్తంత ఉపశమనం లభిస్తుంది. మరోవైపు మూడో వేవ్‌ కూడా త్వరలోనే వస్తుందని అంచనాలు ఉన్న‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరు భయం భయం తో ఉంటున్నారు. ఈ సమయంలోనే కరోనా గురించి ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది.

క‌రోనా మూడో వేవ్‌లో అధిక సంఖ్యలో చిన్నారులు ఈ మహమ్మారికి బలవుతారని అందరూ అంటున్నారు. అయితే యూకే శాస్త్ర‌వేత్త‌లు ఇది నిజం కాద‌ని తేల్చేశారు. క‌రోనా పాజిటివ్ వ‌చ్చేందుకు కార‌ణ‌మైన సార్స్–కోవ్–2 వైరస్ ప్రభావం చిన్న పిల్లలు, టీనేజర్లలో చాలా త‌క్కువుగా ఉంద‌ట‌. ఈ విష‌యాన్ని యూకే శాస్త్ర‌వేత్త‌లు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వ్య‌క్త‌మైంది. అయితే బ‌లిష్టంగా ఉన్న పిల్ల‌ల‌కు క‌రోనాతో ఇబ్బంది లేద‌ట‌. ఇత‌ర వ్యాధులు ఉన్న వారు.. బ‌ల‌హీనంగా ఉన్న వారికి మాత్రం క‌రోనా నుంచి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: