ఈటల : త్వరలో హరీష్ రావుది కూడా నా పరిస్థితే..?

MOHAN BABU
హుజురాబాద్ లో రాబోయే ఉప ఎన్నిక సందర్భంగా  నేతలంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఒకరికొకరు తమదైన శైలిలో  విమర్శనాస్త్రాలు విడుచుకుంటున్నారు. కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గ బాధ్యతలను ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి అప్పజెప్పారు. దీంతో హరీష్ రావుకు  ఈటల రాజేందర్ కు మధ్య  మాటల యుద్ధం నడుస్తోంది. టిఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ ను కేసీఆర్ కుట్రపన్ని లేనిపోని నిందలు వేసి బయటకు పంపారని, ఎలాంటి తప్పు చేయకుండా నేను భయపడనని, నా ఆత్మగౌరవాన్ని చంపుకుని నేను ఉండటం కష్టమని ఆయన అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేలు మంత్రులంతా కేసీఆర్ కింద బానిసలుగా ఉంటున్నారని అన్నారు. తెలంగాణలో ఉద్యమకారులను కాదని, ఎలాంటి ఉద్యమం చేయని వారిని పార్టీలోకి ఆహ్వానించి పదవులు కట్టబెట్టారని అన్నారు.
పార్టీలో కేసీఆర్ కు ఎదురు  మాట్లాడే నాయకుడు ఇప్పటివరకు లేరని  ఒకవేళ మాట్లాడితే  వాళ్లకి కూడా నాకు పట్టిన గతే పడుతుందని టిఆర్ఎస్ పార్టీలో అంతా బానిసలుగా బతుకుతున్నారని ఘాటుగా విమర్శించారు. హుజురాబాద్ నియోజకవర్గం లో ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి డబ్బులతో గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అది సాధ్యం కాని పని అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో బానిసలుగా బతికే, ఎమ్మెల్యేలు,  మంత్రుల పరిస్థితి కూడా రేపు నా పరిస్థితి రావచ్చని మీరంతా ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. రేపు మీ నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. హరీష్ రావు కేసీఆర్ మెప్పు  పొందాలని చూస్తున్నారన్నారు.
 హరీష్ రావు కేసీఆర్ దగ్గర ఎప్పటికీ దగ్గర కాలేడు కానీ, ఆయన కూడా సేమ్ నాకు పట్టిన గతే పడుతుందని అది ముందే ఉందని అన్నారు. హరీష్ రావు పని ఇప్పుడు ఏంటంటే ఇక్కడి మందిని తీసుకుపోవాలె, డబ్బులిచ్చి, దావతులు ఇయ్యాలె ఇదే హరీష్ రావు అని అన్నారు. సి ఎస్ డిజిపి అసలు చట్టానికి లోబడి పని చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రాణాన్ని లెక్కచేయకుండా తెలంగాణ ఉద్యమం కోసం పని చేసిన గడ్డ  హుజురాబాద్ అని, మీ కల్లబొల్లి మాటలను  ఇక్కడి ప్రజలు నమ్మరని ఈటల రాజేందర్  ప్రశ్నించారు. మంత్రులకు ఎమ్మెల్యేలకు స్క్రిప్టు రాసి పంపించి మాట్లాడి ఇస్తున్నారన్నారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి  మంత్రులు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: