య‌న‌మ‌ల‌కు చంద్ర‌బాబు మార్క్ చ‌క్క‌టి చెక్ ?

VUYYURU SUBHASH
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ నేతల్లో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరు. తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం నుంచి వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన యనమల పార్టీలో త‌న‌దైన ముద్ర వేశారు. స్పీకర్ గా, ఆర్థికమంత్రిగా ఎన్నో కీలక పదవులు చేపట్టారు. 2009 ఎన్నికల్లో తొలిసారి తునిలో య‌న‌మ‌ల‌ జోరుకు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైన యనమల 2014 - 2019 ఎన్నికల్లో తన సోదరుడు యనమల కృష్ణుడు కు తుని సీటు ఇప్పించు కున్నారు. ఆ రెండు ఎన్నికల్లోనూ యనమల కృష్ణుడు ఓడిపోయారు. ఓవరాల్ గా చూస్తే యనమల ఫ్యామిలీ తుని లో గత మూడు ఎన్నికల్లోనూ వరుసగా ఓడిపోతూ వస్తోంది. తుని నియోజకవర్గంలో య‌న‌మ‌ల‌ ఫ్యామిలీపై ఉన్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఆ ఫ్యామిలీ పూర్తిగా పట్టు కోల్పోయింది.
2005 నుంచే ఇక్క‌డ య‌న‌మ‌ల అన్నా.. ఆ ఫ్యామిలీ అన్నా తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చేసింది. ఇక్క‌డ తాను పోటీ చేస్తే గెల‌వ‌న‌న్న విష‌యం ఆయ‌న‌కూ తెలుసు. అందుకే య‌న‌మ‌ల గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ తెలివిగా త‌న త‌మ్ముడికే సీటు ఇప్పించుకున్నారు. 2014లో తునిలో య‌న‌మ‌ల సోద‌రుడు ఓడి... పార్టీ అధికారంలోకి రావ‌డంతో చంద్ర‌బాబు య‌న‌మ‌ల‌కు ఏకంగా ఆర్థిక  మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. అప్పుడే సీనియ‌ర్లు గ‌గ్గోలు పెట్టారు. నియోజ‌క‌వ‌ర్గంలో కూడా అది కూడా అప్పుడు జ‌న‌సేన స‌పోర్ట్ ఉన్నా కూడా య‌న‌మ‌ల ఫ్యామిలీ గెల‌వ‌లేద‌ని.. ఆయ‌న్ను ఇక్క‌డ ప‌క్క‌న పెట్ట‌మ‌ని చెప్పినా బాబు విన‌లేదు.
గ‌త ఎన్నిక‌ల్లోనూ య‌న‌మ‌ల సోద‌రుడు ఓడిపోతాడ‌ని చాలా మంది చెప్పినా కూడా బాబు య‌న‌మ‌ల‌కు భ‌య‌ప‌డో లేదా ఆయ‌న‌పై గౌర‌వంతోనో మ‌రోసారి సీటు ఇచ్చారు. ఈ సారి కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అయితే లోకేష్ మాత్రం య‌న‌మ‌ల సేవ‌లు ఇక అవ‌స‌రం లేద‌ని.. ఆయ‌న కాలం చెల్లి న స‌ల‌హాల‌తో పార్టీలో చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నార‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తునిలో య‌న‌మ‌ల ఫ్యామిలీకి సీటు ఇవ్వ‌కూడ‌ద‌ని.. అక్క‌డ కాపు నేత‌కు సీటు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టాక్ ?  ఇక బాబు కూడా లోకేష్ నిర్ణ‌యానికే ఓటేశార‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: