రేవంత్ రెడ్డి భాష మార్చుకోకుంటే చెప్పు దెబ్బలే..!

MOHAN BABU

 రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ టిపిసిసి ఎన్నికైన తర్వాత  రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాకు కాంగ్రెస్ నుంచి పోటీ లేదు అని అనుకుంటూనే మాటలతో యుద్ధం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. నిన్న టిఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు దొంగ అని  అలాంటి దొంగ నుంచి నీతి పలుకులు వస్తాయా అని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు  గండ్ర వెంకటరమణ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి లు విమర్శలు చేశారు. నోరు  అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సంచలనం సృష్టించడానికి నోటికి వచ్చినట్టు మాట్లాడతావా అని చురకలు అంటించారు. చవకబారు రాజకీయాలు చేస్తే  ఖబడ్దార్ అని హెచ్చరించారు.
 పార్టీలు మారిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని అన్న నువ్వు  కాంగ్రెస్లో చేరినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని, నీది నీతిమాలిన రాజకీయం కాదా అని అన్నారు. రాజస్థాన్లో బి ఎస్పి పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నా సీఎం అశోక్ గేహ్లాట్ ను కూడా రాళ్లతో కొడతావా అని ప్రశ్నలతో సంధించారు. కాంగ్రెస్ 10 ఏళ్ల చరిత్రలో ఎన్నో పార్టీలు ఆ పార్టీలో విలీనం అయ్యాయని, ఇందులో ఎంతమందిని రాళ్లతో కొడతారో చెప్పాలని అన్నారు.
 రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు ప్రకారం  తాము టిఆర్ఎస్ లో  చేరామని  స్పష్టం చేశారు. మాణిక్యం ఠాగూర్కు 25 కోట్లు ఇచ్చి  టి పిసిసి  చీప్ కొనుక్కున్న వ్యక్తివి నువ్వే అని  ఆరోపణ చేశారు. అధికారం అనేది గుంజుకుంటే రాదని  ప్రజలు ఇవ్వాలి అన్న సంగతి మరిచి పోతున్నావా అని గుర్తు చేశారు. వెంటనే భాష మార్చుకోకపోతే చెప్పు దెబ్బలు తినడం పక్క అని, చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. కెసిఆర్ అభివృద్ధిని చూడలేకనే  ఇలాంటి విమర్శలు చేస్తున్నాడని, రాబోవు రోజుల్లో ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని, ఓటుకు నోటు దొంగ నువ్వని  కడిగి పారేశారు. ఇలా తెలంగాణ రాజకీయాలు, రాజకీయ నాయకులు రోజురోజుకు మాటలతో  యుద్ధాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: