ఏపీ సీఎం జ‌గ‌న్ డైలీ మెనూ ఇదేనా..!

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్ ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా... చ‌లాకీగా... హుషారుగా క‌నిపిస్తూ ఉంటారు. సీఎం హోదాలో ఉన్న జ‌గ‌న్‌కు ఎన్ని టెన్ష‌న్లు ఉంటాయో ?  ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఓ వైపు స్వ‌ప‌క్షంలోనే విప‌క్షంగా ఉన్న నేత‌ల‌ను శాటిస్ పై చేయాలి.. ఇక ప్ర‌త్య‌ర్థి పార్టీల ఎత్తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడూ గ‌మ‌నిస్తూ వాటికి పై ఎత్తులు వేస్తూ ఉంటారు. ఇక పాల‌న‌పై దృష్టి పెట్టాలి... ప్ర‌జ‌ల‌ను సంతృప్తి ప‌ర‌చాలి. ఈ క్ర‌మంలోనే ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కు కూడా టైం కేటాయించుకోవాలి. ఇందుకోసం ఎన్నో ఒత్తిళ్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇవ‌న్నీ స‌క్ర‌మంగా జ‌ర‌గాలంటే బాడీని , బ్రెయిన్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఫిట్‌నెస్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఫిట్ నెస్ అంటే బాడీకి సంబంధించిందే కాదు.. స‌రైన ఆహారం కూడా స‌రైన టైంకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆరోగ్యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు చెక‌ప్ చేయించుకుంటూ ఉండాలి. ఇందుకోసం ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ డైలీ షెడ్యూల్ ఎలా ?  ఉంటుంది. ఏం ఆహారం తీసుకుంటార‌న్న ఆస‌క్తి ఉంటుంది. ఆ మాట‌కు వ‌స్తే సెల‌బ్రిటీల ఆహారాల‌పై ఆస‌క్తి ఉండ‌డం కామ‌న్‌.

జ‌గ‌న్ ప్ర‌తి రోజు ఉద‌యం 4.30 గంట‌ల‌కు నిద్ర లేచి.. గంట‌లో యోగా, జిమ్ వ‌ర్క్ కంప్లీట్ చేస్తారు. ఆ త‌ర్వాత ఓ గంట పాటు న్యూస్ పేప‌ర్ల‌లో వ‌చ్చిన వార్త‌లు గురించి తెలుసుకుని.. స‌న్నిహితుల‌తో చ‌ర్చిస్తార‌ట‌. ఆ టైంలోనే టీ తాగుతారు. ఆ త‌ర్వాత ఓ గ్లాస్ జ్యూస్ తీసుకోవ‌డంతో పాటు బ్రేక్ ఫాస్ట్ గా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటార‌ట‌. త‌ర్వాత అల్లం టీ తీసుకోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. ఇక లంచ్‌లో అన్నం కంటే కూడా ఎక్కువుగా పుల్కాలు తీసుకోవ‌డ‌మే ఇష్టం.

ఇక నాన్ వెజ్ తినాల్సి వ‌స్తే మ‌ట‌న్ కైమాతో పాటు రాగి సంక‌టి త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే. లంచ్‌లో పెరుగు త‌ప్ప‌నిస‌రి. ఇక రాత్రి వేళ రైస్ లేదా పుల్కాలు తీసుకుంటారు. ఇక ఆదివారం చేప‌ల పులుసు... స్పెష‌ల్ బిర్యానీ తీసుకోవ‌డం జ‌గ‌న్‌కు బాగా ఇష్ట‌మ‌ట‌..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: