"దీదీ" సీఎం పదవికి గండమేనా ?

VAMSI
రెండేళ్ల నుండి కోవిడ్ పరిస్థితులతో దేశమంతా అస్తవ్యస్తంగా ఉంది. ఇప్పుడిప్పుడే కరోనా నుండి మెల్ల మెల్లగా కోలుకుంటోంది. అయితే ఈ కోవిడ్ కొందరి రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే, తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఉన్నపళంగా ఉత్తరాఖం సీఎం తీరథ్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుక పలు కారణాలు వినిపిస్తున్నాయి. రాజీనామా కు ముందు ఢిల్లీ పెద్దలతో భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ మార్చి నెలలో సీఎంగా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ పై సొంతపార్టీలోనే వ్యతిరేకత రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతన్ని బీజేపీ అధిష్టానం తప్పించింది. ఆ స్థానంలో తీరథ్ సింగ్ సీఎం అయ్యారు. కానీ అతను ఎమ్మెల్యే కాదు ఎంపీ కూడా కాదు. 


కానీ అతను సీఎంగా కొనసాగాలంటే ఆరు నెలలలోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ గా గెలవాల్సిన పరిస్థితి. కానీ ప్రస్తుతం కోవిడ్ సమస్యల వలన ఆరు నెలల లోపలఅంటే సెప్టెంబర్ లోపు ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితిని ముందే గమనించిన బీజేపీ ఈ నిర్ణయాన్ని తీసుకుందని తెలిసింది. ఈ సంఘటన వెస్ట్ బెంగాల్ సీఎంగా కొనసాగుతున్న దీదీ విషయంలో ఇదేలాగా జరుగుతుందా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవల జరిగిన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయాన్ని సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. కానీ మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. కానీ సీఎంగా మమతా బెనర్జీని సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. కానీ సీఎంగా ప్రమాణ శీకరం చేసిన తర్వాత ఆరు నెలల్లోపు మళ్ళీ ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ గా ఉంది.


ఆ సమయం నవంబర్ వరకు ఉంది. కానీ కోవిడ్ దృష్ట్యా ఎన్నికల నిర్వహణపై కోర్టులు సీరియస్ గా ఉండడంతో ఈ ఎన్నికలు జరుగుతాయా ? అంతేకాకుండా ఎన్నికల సంఘాలు కూడా ఎన్నికల నిర్వహణకు ముందుకు రావడం లేదు. దీనితో దీ దీ సీఎంగా కొనసాగుతారా లేదా తెలియడం లేదు. కేంద్రప్రభుత్వం అనుకుంటే ఎన్నికలు ఖచ్చితంగా జరగకుండా చేయగలదు. అయితే ఏమి జరుగుతుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: