విదేశీ పార్సిల్.. ఓపెన్ చేసి భయపడిపోయిన అధికారులు?

praveen
సాధారణంగా అయితే విదేశాల నుంచి ఎన్నో రకాల పార్సిల్ లు వస్తూ ఉండటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇట్లా విదేశాల నుంచి వచ్చిన పార్సిల్లను ఎయిర్ పోర్టులో ఉన్న అధికారులు ఎంతో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాటిని ఇక చేరాల్సిన చిరునామాకి చేరవేస్తూ ఉంటారు. అయితే ఇలా వివిధ దేశాలనుంచి వచ్చిన పార్సిల్లను అధికారులు చెక్ చేస్తున్న సమయంలో ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు అధికారులకు షాక్ తగులుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఇలా వివిధ దేశాలనుంచి వచ్చిన పార్సిల్లలో డ్రగ్స్ బయటపడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 కానీ ఇక్కడ మాత్రం పార్సెల్ ఓపెన్ చేసిన అధికారులకు ఎదురైన ఘటనతో ఒక్కసారిగా షాకయ్యారు. కొంత సమయం పాటు భయాందోళనకు గురయ్యారు అధికారులు..  ఏకంగా విదేశాల నుంచి వచ్చిన పార్సెల్ ఓపెన్ చేస్తే ఇక ఆ పార్సిల్లో మొత్తం సాలెపురుగులు ఉన్నాయి.  దీంతో ఆ పార్సల్ ఓపెన్ చేసిన అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన చెన్నై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఇక పార్సిల్ లో బతికి ఉన్న 107 సాలెపురుగు లను స్వాధీనం చేసుకున్నారు ఎయిర్పోర్ట్ అధికారులు. వివరాల్లోకి వెళితే... తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి పేరు మీద పార్సిల్ వచ్చింది.


 ఇక సాధారణంగానే అధికారులు విదేశాల నుంచి వచ్చిన పార్సిల్లను చెక్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన కూడా పార్సిల్ ను చెక్ చేశారు అధికారులు. కానీ ఎందుకో అనుమానం వచ్చింది. దీంతో ఆ పార్సెల్ ఓపెన్ చేసి చూశారు. ఇక ఒక్కసారిగా అధికారులు అందరూ షాక్ అయ్యారు. ఆ పార్సల్ ఓపెన్ చేయగానే అందులో నుంచి సాలెపురుగులు బయటికి రావడం మొదలుపెట్టాయి. ఏకంగా ఆ పార్సిల్ లో 107 సాలెపురుగులు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పోలాండ్ నుంచి వీటిని దిగుమతి చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.  ఇక ఈ 107 సాలె పురుగు లను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏదేమైనా ఒక్కసారిగా విదేశీ పార్సిల్లో సాలెపురుగులు బయటికి రావడం మాత్రం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: