ఆంధ్రాలో మళ్ళీ పెరిగిన కేసులు....

Purushottham Vinay
కరోనా మహమ్మారి ప్రభావం ఎలా వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతేడాది వచ్చిన ఈ వైరస్ ప్రపంచం మొత్తాన్ని అల్ల కల్లోలం చేసిన సంగతి తెలిసిందే. ఇక కరోనా సెకండ్ వేవ్ అయితే ఇండియాలో చాలా దారుణంగా వ్యాప్తి చెందింది. చాలా మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఇక ఆంధ్ర ప్రదేశ్లో కూడా వ్యాప్తి చెందిన ఈ వైరస్ గత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా కూడా తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుముఖం పడుతోందనే చెప్పాలి. కాని నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు పెరిగాయనే చెప్పాలి...ఇక గడిచిన 24 గంటల్లో మొత్తం 91,231 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. అందులో కొత్తగా 3620 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక దీనితో ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,85,716కి చేరింది. ఇందులో మొత్తం 40,074 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 18,32,971 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అటు నిన్న కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దీనితో మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,671కు చేరుకుంది.ఇక గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మొత్తం 5757 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఇక నేటితో ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,18,95,922 కరోనా సాంపిల్స్‌ను పరీక్షించారు.ఇక జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు చూసుకున్నట్లయితే ఇలా ఉన్నాయి.. అనంతపురం జిల్లాలో 190, చిత్తూరు జిల్లాలో 451, తూర్పుగోదావరి జిల్లాలో 617, గుంటూరు జిల్లాలో 299, కడప జిల్లాలో 137, కృష్ణా జిల్లాలో 332, కర్నూలు జిల్లాలో 44, నెల్లూరు జిల్లాలో 210, ప్రకాశం జిల్లాలో 386, శ్రీకాకుళం జిల్లాలో 118, విశాఖపట్నం జిల్లాలో 176, విజయనగరం జిల్లాలో 95, పశ్చిమ గోదావరి జిల్లాలో 565 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: